AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా, ఆ తర్వాతే కొత్త షెడ్యూల్ - విద్యాశాఖ ప్రకటన
AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. మరోసారి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షలపై(AP DSC 2024) క్లారిటీ ఇచ్చింది ఏపీ విద్యాశాఖ. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఇవాళ్టి(మార్చి 30) నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో…. పరీక్షల నిర్వహణ కోసం ఈసీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో….. మరోసారి డీఎస్సీ పరీక్షలను వాయిదా(AP DSC 2024 Postponed) వేసింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఓ ప్రకటన విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తరువాతే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. సెంటర్ల ఎంపిక ఆప్షన్లు కూడా ఈసీ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 25వ తేదీ నుంచే ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు((AP DSC Hall Tickets 2024)) అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈసీ అనుమతి రాగానే హాల్ టికెట్లను విడుదల చేస్తామని ఇటీవలే విద్యాశాఖ తెలిపింది. కానీ ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవటంతో మరోసారి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడాల్సి వచ్చింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో… ఇప్పటికే ఓసారి పరీక్షల షెడ్యూల్ మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో… మళ్లీ వాయిదా పడింది.
AP TET Results 2024; మరోవైపు ఏపీ టెట్ ఫలితాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ తేదీనే టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాలేదు. ఎన్నికల కోడ్ కారణంతోనే… ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. ఈసీ అనుమతి ఇస్తేనే… టెట్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ ఇటీవలే ప్రకటించింది. దీంతో ప్రస్తుతం టెట్ ఫలితాలు కూడా పెండింగ్ లో నే ఉన్నాయి.
రీవైజెడ్ షెడ్యూ ప్రకారం… ఇవాళ్టి నుంచే డీఎస్సీ ఎగ్జామ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఏప్రిల్ 3 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. కానీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో మళ్లీవాయిదా పడాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాతే…టెట్ ఫలితాలు విడుదల కావటంతో పాటు డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం కొత్త షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.