Election Campaign: ఈసీ అనుమతిస్తేనే ఇంటింటి ప్రచారంపై నిర్ణయం, పార్టీ కార్యాలయాల్లో హోర్డింగులకు ఓకే -సీఈఓ మీనా-decision on door to door campaign only if ec permits only one flag allowed in party offices ceo meena ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Campaign: ఈసీ అనుమతిస్తేనే ఇంటింటి ప్రచారంపై నిర్ణయం, పార్టీ కార్యాలయాల్లో హోర్డింగులకు ఓకే -సీఈఓ మీనా

Election Campaign: ఈసీ అనుమతిస్తేనే ఇంటింటి ప్రచారంపై నిర్ణయం, పార్టీ కార్యాలయాల్లో హోర్డింగులకు ఓకే -సీఈఓ మీనా

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 06:44 PM IST

Election Campaign: కేంద్ర ఎన్నికల సడలింపుకు అనుమతిస్తేనే ఇంటింటి ప్రచారంపై నిర్ణయం ఉంటుందని, తాత్కలిక పార్టీ కార్యాలయాల్లో కూడా ఒక్క జెండాకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం సీఈఓ మీనా స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారాలపై సమీక్షిస్తున్న సీఈఓ మీనా
ఎన్నికల ప్రచారాలపై సమీక్షిస్తున్న సీఈఓ మీనా

Election Campaign: స్థానిక చట్టాలు, అనుమతుల మేరకే రాజకీయ ప్రకటనలు Election Campaign ఉండాలని, రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్‌లకు అనుమతి తప్పనిసరి అని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి మీనా Ceo Meenaస్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక జెండాను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సీఈఓ ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లును, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరును Review సమీక్షించారు.

మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన సందర్బంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంతో పాటు పలు సమస్యలను సీఈఓ దృష్టికి తెచ్చినట్టు వివరించారు.

శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులకు ఓకే…

ఎప్పటి నుండో శాశ్వత ప్రాతిపదిక ఉన్న పార్టీ కార్యాలయాల్లో అనుమతి పొంది ఉన్న హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలన్నారు. హోర్డింగుల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్ ను అనుమతించాలన్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పని సరని, అయితే ఇందుకు 48 గంటల ముందుగా సువిధా పోర్టల్లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు.

అత్యవసర పరిస్థితిల్లో రాజకీయ పార్టీలు 48 గంటల ముందు ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేని పక్షంలో ఆఫ్ లైన్ ద్వారా కూడా అత్యవసర దరఖాస్తులను స్వీకరించి, ఆ వివరాలు అన్నింటినీ ఎన్కోర్ (Encore) పోర్టల్లో నమోదు చేసి సకాలంలో తగిన అనుమతులను జారీచేయాలని సూచించారు.

కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం..

ముందుగా అనుమతి పొందిన తదుపరే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన అమలు దుస్సాధ్యమని, ఈ నిబంధనను పున: సమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్త కంఠంతో కోరాయన్నారు. ఈ నిబంధన అమలు విషయంలో పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు, భారత ఎన్నికల సంఘం ECI దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లామన్నారు.ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు తెలియచేస్తామన్నారు.

ప్రభుత్వ స్థలాలు,కార్యాలయాల్లో ప్రచారం నిషిద్ధం..

రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబందించి భారత ఎన్నిక సంఘం మార్గదర్శకాలతో పాటు ఆంద్రప్రదేశ్ పురపాలక చట్టం, స్థానిక సంస్థల చట్టం, జి.హెచ్.ఎం.సి. చట్టాలను పరిగణలోకి తీసుకుంటూ అనుమతులను మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ సూచించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతో పాటు కార్యాలయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల ప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయిచాలని, నూతన హోర్డింగులకు అనుమతులను ఏమాత్రం ఇవ్వద్దన్నారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు ఎటు వంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలన్నారు.

ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణాలను మరోసారి పరిశీలించాలని, స్ట్రక్చర్ లో ఏమాత్రం దృఢత్వం లేకున్నా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. ముందస్తు అనుమతితో ప్రైవేటు ప్రాంగణాల్లో సులువుగా తరలించగలిగే ఒక జండాను, చిన్న బ్యానర్ ను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించాలని సూచించారు.

సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిష్టాన్ని పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం