AP TET DSC 2024 : గడువు సమీపించింది..! పెండింగ్ లోనే ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలపై వీడని సందిగ్ధత..!
AP TET DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మార్చి 30వ తేదీనే పరీక్షలు జరగాల్సిన ఉన్నప్పటికీ… ఇంకా హాల్ టికెట్లు అందుబాటులోకి రాలేదు.
AP TET DSC 2024 Updates: ఏపీ డీఎస్సీ పరీక్షల(AP DSC Exams 2024) గడువు సమీపించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... మార్చి 30వ తేదీనే ఎగ్జామ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. అయితే గడువు సమీపించటంతో... పరీక్షల నిర్వహణపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.... ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. ఇప్పటికే విద్యాశాఖ.... పరీక్షల నిర్వహణ కోసం ఈసీకి లేఖ రాసింది. అనుమతి రాగానే హాల్ టికెట్లను(AP DSC Hall Tickets 2024) మంజూరు చేస్తామని చెప్పింది. కానీ మార్చి 30వ తేదీనే పరీక్షలు ప్రారంభం కావాల్సినప్పటికీ... ఇప్పటివరకు అయితే విద్యాశాఖ నుంచి తాజా ప్రకటన రాలేదు.
అందుబాటులోకి రాని హాల్ టికెట్లు….
ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 25వ తేదీ నుంచే ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు((AP DSC Hall Tickets 2024)) అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ వెబ్ సైట్ లో హాల్ టికెట్ల విడుదలకు సంబంధించి ఎలాంటి ఆప్షన్ కనిపించటం లేదు. ఈసీ అనుమతి రాగానే హాల్ టికెట్లను విడుదల చేస్తామని ఇటీవలే విద్యాశాఖ తెలిపింది. అయితే పరీక్షల గడువుకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటంతో…. అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో… ఇప్పటికే ఓసారి పరీక్షల షెడ్యూల్ మారింది. తాజాగా కోడ్ ఎఫెక్ట్ తో మళ్లీ షెడ్యూల్ మారుతుందా…? అన్న చర్చ వినిపిస్తోంది. దీనిపై అభ్యర్థులు కూడా గందరగోళానికి గురవుతున్నారు.
పెండింగ్ లోనే టెట్ ఫలితాలు..!
AP TET Results 2024; మరోవైపు ఏపీ టెట్ ఫలితాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ తేదీనే టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాలేదు. ఎన్నికల కోడ్ కారణంతోనే… ఫలితాల విడుదలకు బ్రేక్ పడినట్లు విద్యాశాఖ ఇటీవలే ప్రకటించింది. ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇదే విషయంపై సర్కార్ లేఖ రాసినప్పటికీ…ఈసీ నుంచి జవాబు వచ్చిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
రేపటితో పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఇవాళ ఏపీ విద్యాశాఖ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. పరీక్షలు జరుగుతాయా లేదా అనేది ప్రకటించవచ్చని సమాచారం.
Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి... స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.