AP DSC TET 2024 : దగ్గరపడుతున్న ఏపీ డీఎస్సీ పరీక్షల గడువు - ఇవాళ 'టెట్' ఫలితాలు..?-ap tet results 2024 may be released today or tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc Tet 2024 : దగ్గరపడుతున్న ఏపీ డీఎస్సీ పరీక్షల గడువు - ఇవాళ 'టెట్' ఫలితాలు..?

AP DSC TET 2024 : దగ్గరపడుతున్న ఏపీ డీఎస్సీ పరీక్షల గడువు - ఇవాళ 'టెట్' ఫలితాలు..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 20, 2024 04:22 PM IST

AP TET Results 2024 Updates: ఏపీ టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ తేదీన ఫలితాలు వెల్లడించాలి. ..కానీ ఇప్పటివరకు రిజల్ట్స్ రాలేదు. అయితే ఇవాళ లేదా రేపు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ టెట్ ఫలితాలు
ఏపీ టెట్ ఫలితాలు

AP TET Results 2024 Updates: ఏపీ టెట్ పరీక్షల(AP TET Results 2024) కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఓవైపు డీఎస్సీ(AP DSC 2024 Applications) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో…. ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 14వ తేదీనే ఫలితాలు రావాల్సి ఉంది. కానీ ఫలితాలు వెల్లడికాలేదు. అయితే మార్చి 13వ తేదీన రావాల్సిన ఫైనల్ కీ లను మాత్రం… మార్చి 14వ తేదీన అందుబాటులోకి తీసుకువచ్చింది ఏపీ విద్యాశాఖ. ముందుగా ప్రకటించిన తేదీ దాటిపోవటంతో…. ఫలితాల కోసం చాలా మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను బట్టి డీఎస్సీ సన్నద్ధతతో పాటు దరఖాస్తు చేసుకునే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు డీఎస్సీ పరీక్షలకు టైం దగ్గరపడుతున్న నేపథ్యంలో… టెట్ ఫలితాల(TET Results) విడుదలకు ఏపీ విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం. ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి... స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.

AP DSC 2024 Updates: ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు

మరోవైపు ఏపీ డీఎస్సీ (AP DSC 2024) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 30వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇందులో భాగంగా… ఇవాళ్టి నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.ఈ మేరకు వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మార్చి 25 నుంచి అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. మార్చి 30వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అవుతుండగా… ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15వ తేదీ నుంచే ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్‌ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇవ్వటంతో…. డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్‌ రూపొందించింది ఏపీ విద్యాశాఖ. దీంతో పరీక్షల తేదీలు మారాయి.

Whats_app_banner