TS TET Notification 2024 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల - మే 20 నుంచి పరీక్షలు, ముఖ్య తేదీలివే
TS TET Notification 2024 Updates: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 27వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
TS TET Notification 2024 : టెట్ నిర్వహణకు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విద్యాశాఖ నోటిఫికేషన్(TS TET Notification 2024) జారీ చేసింది. మార్చి 27వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది. జూన్ 3వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని పేర్కొంది. https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించింది.
TS TET Key Dates : ముఖ్య తేదీలు:
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ - 04, మార్చి, 2024.
దరఖాస్తులు ప్రారంభం -మార్చి 27, 2024.
దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 10, 2024.
పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.
పరీక్షల ముగింపు - జూన్ 06,2024.
అధికారిక వెబ్ సైట్ - https://tstet.cgg.gov.in/
కొనసాగుతున్న డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ….
Telangana Mega DSC 2024: మరోవైపు మెగా డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
తాజాగా టెట్ నోటిఫికేన్ విడుదలైన నేపథ్యంలో…. డీఎస్సీకి భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అర్హత సాధిస్తే…. డీఎస్సీ పరీక్షలు రాసే అవకాశం దక్కనుంది.