AP DSC New Schedule 2024 : అలర్ట్.... ఏపీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్పు - 25 నుంచి హాల్ టికెట్లు, కొత్త తేదీలివే-changes in ap dsc exam schedule 2024 check the full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc New Schedule 2024 : అలర్ట్.... ఏపీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్పు - 25 నుంచి హాల్ టికెట్లు, కొత్త తేదీలివే

AP DSC New Schedule 2024 : అలర్ట్.... ఏపీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్పు - 25 నుంచి హాల్ టికెట్లు, కొత్త తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 10, 2024 07:11 AM IST

AP DSC Exam Schedule 2024 Updates: డీఎస్పీ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ విద్యాశాఖ. ఇటీవలే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో… డీఎస్సీ పరీక్ష(AP DSC Exam 2024) షెడ్యూల్ లో మార్పులు చేపట్టింది.

ఏపీ డీఎస్సీ 2024
ఏపీ డీఎస్సీ 2024 (https://apdsc.apcfss.in/)

AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షకు సంబంధించి కీలక మార్పులు చేసింది ఏపీ విద్యాశాఖ. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువుపై ఇటీవలే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొత్త షెడ్యూల్(AP DSC New Schedule 2024) ను ప్రకటించింది. ఫలితంగా మార్చి 30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్‌ 30 వరకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

హైకోర్టు కీలక ఆదేశాలు…

ఏపీ టెట్(AP TET), టీఆర్టీ పరీక్షల(TRT) మధ్య తగిన గడువు ఉండాలని ఇటీవలే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. టెట్, టీఆర్టీ మధ్య తగిన గడువు ఉండాలని, ఆ విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దిరాజు, మరో నలుగురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, తగిన గడువు ఉండేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. టెట్ పరీక్షలు(AP TET Exams 2024) ముగిసిన వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీంతో ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయంలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై వాదనలు ఉన్న హైకోర్టు...టెట్, టీఆర్టీ మధ్య నాలుగు వారాలు గడువు ఉండేలా పరీక్షలు షెడ్యూల్ చేయాలని మార్చి 4వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్‌ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇవ్వటంతో…. డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్‌ రూపొందించింది ఏపీ విద్యాశాఖ.

AP DSC New Schedule 2024: ఏపీ డీఎస్సీ కొత్త తేదీలు….

  • మార్చి 30వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
  • ఏప్రిల్‌ 3 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
  • రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.
  • ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయి.
  • మార్చి 20 నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్‌ ఆప్షన్లు ఇస్తారు.
  • మార్చి 25 నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP TET 2024 Key : మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాత పరీక్షల కీ, ప్రశ్న పత్రాలను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మార్చి 2, 3 తేదీల్లో టెట్ కు హాజరైన అభ్యర్థుల..జవాబు కీ లు, ప్రశ్నపత్రాలను సబ్జెక్టుల వారీగా aptet.apcfss.in వెబ్‌సైట్‌లో పెట్టింది. గతంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు పరీక్ష రాసిన కీ, ప్రశ్నాపత్రాలు విడుదల చేసింది. తాజాగా మార్చి 2, 3 తేదీల్లో పరీక్షలు రాసిన అభ్యర్థుల కీ, క్వాశ్చన్ పేపర్లను అందుబాటులో ఉంచింది. ఈ ప్రాథమిక కీ పై అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు.

ఏపీ టెట్ 2024 ఫైనల్ కీని మార్చి 13న, తుది ఫలితాలను(AP TET Results 2024) మార్చి 14న విడుదల చేస్తారు. ఏపీ టెట్ పోర్టల్‌ను యాక్సెస్ కు సంబంధించి ఏదైనా సహాయం కోసం అభ్యర్థులు 9505619127, 9705655349, 8121947387 లేదా 8125046997కి ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుండి 5.00 వరకు కాల్ చేయవచ్చు.