AP TET Exams: నేటి నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ-tet exams in ap from today conducting exam in two sessions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Exams: నేటి నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ

AP TET Exams: నేటి నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ

Sarath chandra.B HT Telugu
Feb 27, 2024 06:18 AM IST

AP TET Exams: ఏపీలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 6వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ
నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ (Pixabay )

AP TET Exams: ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ School Education ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 2024 టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రెండు సెషన్లలో టెట్‌ పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9గం.30. నుంచి 12గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నాం 2గం.30ని. నుంచి సాయంత్రం 5గం. దాకా మరో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు Exam Centres చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

టెట్‌ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ Computer Based test విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణాలో Telangana మూడు, కర్ణాటక Karnatakaలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్‌ అధికారుల్ని నియమించారు. పరీక్షా కేంద్రాల తనిఖీలకి 29 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. గర్బిణీ అభ్యర్ధులకి సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇక.. విద్యాశాఖ ముందస్తుగానే రిలీజ్‌ చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ.. 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

నేటి (27వ తేదీ) నుంచి ఏపీ టెట్ పరీక్షలు

• పేపర్ 1 A: 27. 02.2024 నుండి 01.03. 2024 వరకు

• పేపర్ 2 A: 02.03.2024 నుండి 04.03.2024 వరకు మరియు 06.03.2024

• పేపర్ 1B : 05. 03. 2024 (FN)

• పేపర్ 2B: 05. 03. 2024 (AN)

ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఈ టెట్ పరీక్షలకు గాను 2,67,559 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. 120 పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులతో సంసిద్ధం చేశామన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల్లో వైద్య, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశామని తెలిపారు.

పొరుగు రాష్ట్రాల పరీక్షా కేంద్రాలివే..

రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 3, కర్నాటకలో 3, తమిళనాడులో 2, ఒడిశాలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణలో 3 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ION డిజిటల్ జోన్ IDZ కర్మన్‌ఘాట్ (హైదరాబాద్), దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (ఖమ్మం), సనా ఇంజినీరింగ్ కళాశాల (కోదాడ)లో ఏపీ టెట్ పరీక్ష నిర్వహిస్తారు.

కర్నాటక రాష్ట్రంలో iON డిజిటల్ జోన్ iDZ తీగలపాళ్య ప్రధాన రహదారి (బెంగళూరు), BITBYTECH సొల్యూషన్స్ (బెంగుళూరు), అరైజ్ టెక్నాలజీస్ సెంటర్ I (బెంగళూరు)లో పరీక్షలు జరుగుతాయి.

తమిళనాడులో iON డిజిటల్ జోన్ iDZ కోవిలంబాక్కం (చెన్నై), S.I.V.E.T కళాశాల (చెన్నై)లో పరీక్షలు జరుగుతాయి.

ఒడిశాలో iON డిజిటల్ జోన్ iDZ ఖల్లికోట్ కళాశాల ప్రాంతం (బరంపురం), SMIT డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల (బరంపురం)లో పరీక్షల్ని నిర్వహిస్తారు.

అన్ని జిల్లాలో ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించడానికి పాఠశాల విద్యకు సంబంధించింన 26 మంది సీనియర్ అధికారులను పరిశీలకులు (district level observers) గా నియమించినట్టు తెలిపారు. ప్రతి 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ (హెడ్ మాస్టర్ లేదా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్) ను పర్యవేక్షణ కోసం నియమించారు.

హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు మరియు ఒడిశా పరీక్షా కేంద్రాలకు కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల ను నియమించామని కమిషనర్‌ తెలిపారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించడానికి 35 మంది ప్లైయింగ్ స్క్వాడ్లుగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డైట్ ప్రిన్సిపాళ్లను నియమించామని తెలిపారు.

అంగవైకల్యం కలిగిన అభ్యర్థులు పరీక్ష రాయడానికి గాను స్కైబ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. వారికి 50 నిమిషాలు అదనపు సమయాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్లలో మైనర్ మిస్టేక్స్ ఉన్నట్లయితే వారు పరీక్షా కేంద్రాల్లో సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. ఆన్లైన్ పరీక్ష నిర్వహించే సమయంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఉదయం 7.30 నుండి సాయంత్రం 7.00 గంటల వరకు ఏర్పాటు చేశామని తెలిపారు

గర్భిణీలకు వెసులుబాటు

ఏపీ టెట్ రాయనున్న గర్భిణీ అభ్యర్థులు సమీప పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసుకోవడానికి వెసులు బాటు కల్పించామని అన్నారు. వీళ్లు ముందుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇవ్వాలని కోరారు.