AP TET Updates 2024 : రేపట్నుంచి ఏపీ 'టెట్' పరీక్షలు - ప్రాక్టీస్ కోసం మాక్ టెస్టులను ఇలా రాసుకోవచ్చు
AP TET 2024 Updates: ఏపీ టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మాక్ టెస్టులు రాసే అవకాశం కూడా కల్పించింది విద్యాశాఖ.
AP TET Mock Tests 2024 Updates: ఆంధ్రప్రదేశ్ టీచర్ అర్హత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఇప్పటికే వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మొదలుకానున్న పరీక్షలు…. మార్చి 9వ తేదీతో ముగియనున్నాయి. అయితే పరీక్షలు రాసే అభ్యర్థులు… ప్రాక్టీస్ చేసుకునే దిశగా మాక్ టెస్టులను రాసే అవకాశం కల్పించింది విద్యాశాఖ. ఆ పరీక్షలను ఎలా రాయాలో ఇక్కడ చూడండి….
టెట్ రాసే అభ్యర్థులు… పరీక్షా విధానంతో పాటు పేపర్ మోడల్, మార్కుల కేటాయింపు, సమయం వంటి వివరాలను ప్రాక్టికల్ గా తెలుసుకునేందుకు మాక్ టెస్టులను రాసేందుకు వీలుగా చర్యలు తీసుకుంది ఏపీ విద్యాశాఖ. అధికారిక వెబ్ సైట్ లో పేపర్ 1తో పాటు పేపర్ 2 పరీక్షలను రాసే వీలు కల్పించింది.
మాక్ టెస్టులను ఇలా రాసుకోండి…
అభ్యర్థులు ముందుగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
MOCK TEST LINKS అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పది పరీక్షల పేపర్లు డిస్ ప్లే అవుతాయి.
మీరు రాసే సబ్జెక్టుకు అనుగుణంగా… ఆ పక్కన ఉండే లింక్ పై క్లిక్ చేయాలి.
లింక్ పై క్లిక్ చేయగానే…. సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది. మీరు జవాబులు ఇవ్వొచ్చు. ఎంత స్కోరింగ్ వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు.
ఈ మాక్ టెస్టులను రాయటం ద్వారా… ప్రశ్నాపత్రాల నమూనాలే కాకుండా ఆన్ లైన్ పరీక్షల విషయంలో ఓ అంచనాకు రావొచ్చు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా టెట్ నిర్వహణకు 120 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఏమైన సందేహాలు అంటే హెల్ప్ డెస్క్(95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997) ను సంప్రదించవచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ డెస్క్ లు పనిచేస్తాయి. ఇక డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఏపీ హైకోర్టు(AP High Court) ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న బీఈడీ అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థుల ఆధార్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో ఫీజును రిఫండ్ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఏపీ టెట్‌కు 2,67,559 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు.
AP TET 2024 admit card: ఇలా డౌన్లోడ్ చేసుకోండి
టెట్ అభ్యర్థులు మొదటగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Candidate ID, పుట్టినతేదీతో Verfication Code ను ఎంట్రీ చేయాలి.
మీ టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఏపీ టెట్ 2024 ముఖ్య తేదీలు:
ఏపీ టెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 7, 2024.
దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 18 వరకు అప్లికేషన్లు స్వీకరించారు.
ఈ నెల 19వ తేదీన అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు.
ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు.
టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు.
మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం