AP TET Updates : ఏపీ టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం, 120 కేంద్రాల్లో పరీక్షలు- ఆ అభ్యర్థులకు ఫీజు రిఫండ్!
AP TET Updates : ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్టు చేసిన బీఈడీ అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.
AP TET Updates : ఏపీ టెట్(AP TET 2024) దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్లు(TET Hall Tickets) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఏపీ హైకోర్టు(AP High Court) ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న బీఈడీ అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థుల ఆధార్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో ఫీజును రిఫండ్ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఏపీ టెట్‌కు 2,67,559 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు.
120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ
రాష్ట్ర వ్యాప్తంగా టెట్ నిర్వహణకు 120 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. అభ్యర్థులకు ఏమైన సందేహాలు అంటే హెల్ప్ డెస్క్(95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997) ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ డెస్క్ లు పనిచేస్తాయన్నారు. ఎస్జీటీ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి మొదటి ప్రాధాన్యతా కేంద్రాన్నే కేటాయించామన్నారు.
హాల్ టికెట్లు విడుదల
ఏపీ టెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి. అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి టెట్ పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 9వ తేదీతో ముగియనున్నాయి.
ఏపీ టెట్ అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Step 1 : టెట్ అభ్యర్థులు మొదటగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Step 2 : హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : Candidate ID, పుట్టినతేదీతో Verfication Code ను ఎంట్రీ చేయాలి.
Step 4 : మీ టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
Step 5 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఏపీ టెట్ 2024 ముఖ్య తేదీలు:
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం