AP TET 2024 Key : ఏపీ టెట్ కీ, ప్రశ్నాపత్రాలు విడుదల- అభ్యంతరాలు ఇలా తెలియజేయవచ్చు!-amaravati news in telugu ap tet 2024 answer key question papers objection window opened ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Key : ఏపీ టెట్ కీ, ప్రశ్నాపత్రాలు విడుదల- అభ్యంతరాలు ఇలా తెలియజేయవచ్చు!

AP TET 2024 Key : ఏపీ టెట్ కీ, ప్రశ్నాపత్రాలు విడుదల- అభ్యంతరాలు ఇలా తెలియజేయవచ్చు!

Bandaru Satyaprasad HT Telugu
Mar 06, 2024 06:27 PM IST

AP TET 2024 Key : ఏపీ టెట్ కీ, ప్రశ్నాపత్రాలను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ప్రాథమిక కీ చెక్ చేసుకుని అభ్యంతరాలు తెలియజేసేందుకు విండో ఇచ్చింది.

ఏపీ టెట్ కీ, ప్రశ్నాపత్రాలు విడుదల
ఏపీ టెట్ కీ, ప్రశ్నాపత్రాలు విడుదల

AP TET 2024 Key : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాత పరీక్షల కీ, ప్రశ్న పత్రాలను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మార్చి 2, 3 తేదీల్లో టెట్ కు హాజరైన అభ్యర్థుల..జవాబు కీ లు, ప్రశ్నపత్రాలను సబ్జెక్టుల వారీగా aptet.apcfss.in వెబ్‌సైట్‌లో పెట్టింది. గతంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు పరీక్ష రాసిన కీ, ప్రశ్నాపత్రాలు విడుదల చేసింది. తాజాగా మార్చి 2, 3 తేదీల్లో పరీక్షలు రాసిన అభ్యర్థుల కీ, క్వాశ్చన్ పేపర్లను అందుబాటులో ఉంచింది. ఈ ప్రాథమిక కీ పై అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు.

ఏపీ టెట్ కీ, ప్రశ్న పత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల విండో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ టెట్(AP TET 2024) పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పూర్తైన పరీక్షల కీ(AP TET Key) లు, ప్రశ్నాపత్రాలు, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది. మిగిలిన పరీక్షల సమాధానాల కీలు నిర్ణీత సమయంలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన జవాబు కీలు అధికారిక వెబ్ సైట్ లో PDFలుగా అందుబాటులో ఉంచారు. వీటిని డౌన్‌లోడ్ చేయడానికి లాగిన్ వివరాలు అవసరం లేదు. అయితే అభ్యర్థులు తమ అభ్యంతరాలను లేవనెత్తడానికి, రెస్పాన్స్ షీట్లు తనిఖీ చేయడానికి అభ్యర్థి ID, పుట్టిన తేదీతో వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.

మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు

ఏపీ టెట్ 2024 ఫైనల్ కీని మార్చి 13న, తుది ఫలితాలను(AP TET Results) మార్చి 14న విడుదల చేస్తారు. ఏపీ టెట్ పోర్టల్‌ను యాక్సెస్ కు సంబంధించి ఏదైనా సహాయం కోసం అభ్యర్థులు 9505619127, 9705655349, 8121947387 లేదా 8125046997కి ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుండి 5.00 వరకు కాల్ చేయవచ్చు.

ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్లు

ఏపీ పాఠశాల విద్యా శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో టెట్ 2024 రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు తన ID, పుట్టిన తేదీలతో రెస్పాన్ షీట్లను యాక్సెస్ చేయవచ్చు.

ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్(AP TET Response Sheets Download) డౌన్ లోడ్ ఎలా?

Step 1 : ఏపీ టెట్ aptet.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

Step 2 : హోమ్‌పేజీలో రెస్పాన్స్ షీట్ల లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : అభ్యర్థి ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.

Step 4 : AP TET రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

సంబంధిత కథనం