TS DSC 2024 Updates : జులై 17 నుంచి 'మెగా డీఎస్సీ' పరీక్షలు - దరఖాస్తుల గడువు పెంపు-ts mega dsc 2024 exams will start from 17th july ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Dsc 2024 Updates : జులై 17 నుంచి 'మెగా డీఎస్సీ' పరీక్షలు - దరఖాస్తుల గడువు పెంపు

TS DSC 2024 Updates : జులై 17 నుంచి 'మెగా డీఎస్సీ' పరీక్షలు - దరఖాస్తుల గడువు పెంపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 15, 2024 02:01 PM IST

Telangana Mega DSC 2024 Updates : తెలంగాణ మెగా డీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జులై 17వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది.

తెలంగాణ డీఎస్సీ పరీక్షలు - 2024
తెలంగాణ డీఎస్సీ పరీక్షలు - 2024 (https://tsdsc.aptonline.in/)

Telangana Mega DSC 2024 Updates : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు(Telangana Mega DSC 2024) సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా…. జూన్ 20వ తేదీ వరకు గడువును పెంచింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3వ తేదీనే గడువు ముగుస్తుంది. కానీ తాజాగా టెట్ నోటిఫికేషన్(TS TET Notification 2024) విడుదలైన నేపథ్యంలో…. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేసింది విద్యాశాఖ.11,062 టీచర్ పోస్టుల భర్తీకి మార్చి 4వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

TS DSC Exams 2024 : పరీక్ష తేదీలు ఖరారు….

డీఎస్సీ దరఖాస్తులను పెంచటమే కాకుండా... పరీక్షల తేదీలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది విద్యాశాఖ. జులై 17వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు(TS DSC Exams 2024) ప్రారంభం అవుతాయని తెలిపింది. జులై 31వ తేదీతో ఈ ఎగ్జామ్స్ ముగుస్తాయని వెల్లడించింది.

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేష ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..... మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 కొలవులు ఉన్నాయి. ఇక గతంలో దరరఖాస్తు చేసుకున్న వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.... ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. పోస్టుల సంఖ్య పెంపుతో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.

డీఎస్సీ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Click Here for Direct Recruitment of TS DSC - 2024 అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. Edit Post Applied అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి Candidate's Aadhaar No, Payment Reference IDని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్మాత తిరిగి సబ్మిట్ చేయాలి.ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

TS TET Notification 2024 : మరోవైపు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 27వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలంగాణ విద్యాశాఖ గురువారం ప్రకటించింది. జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించింది.

TS TET Key Dates : ముఖ్య తేదీలు:

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ - 04, మార్చి, 2024.

దరఖాస్తులు ప్రారంభం -మార్చి 27, 2024.

దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 10, 2024.

పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.

పరీక్షల ముగింపు - జూన్ 06,2024.

అధికారిక వెబ్ సైట్ - https://tstet.cgg.gov.in/

WhatsApp channel