DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్, ఇలా దరఖాస్తు చేసుకోండి!-hyderabad news in telugu free coaching for dsc applicants in sc study circle ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad News In Telugu Free Coaching For Dsc Applicants In Sc Study Circle

DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్, ఇలా దరఖాస్తు చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Mar 09, 2024 09:20 PM IST

DSC Free Coaching : తెలంగాణ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. డీఎస్సీ దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది హైదరాబాద్ లోని ఎస్సీ స్టడీ సర్కిల్. ఫ్రీ కోచింగ్ కోసం మార్చి 12 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్
డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్

DSC Free Coaching : తెలంగాణ ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు (DSC Applications)చేసుకున్న అభ్యర్థులకు ఓ గుడ్ న్యూస్. డీఎస్సీ అప్లై చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్(DSC Free Coaching) ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ శనివారం ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలల పాటు ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 12 నుంచి 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

16 కేంద్రాల్లో ఫ్రీ కోచింగ్

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు... ప్రభుత్వ డైట్‌, బీఎడ్‌ (B.Ed)కాలేజీలతో పాటు ఇతర కాలేజీలతో కలిపి మొత్తం 16 కేంద్రాలలో ఫ్రీ డీఎస్సీ కోచింగ్ ఇస్తామని ఎస్సీ స్టడీ సర్కిల్(TS SC Study Circle) తెలిపింది. ప్రతి కేంద్రంలో 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్‌ అందించనున్నారు. అయితే అభ్యర్థులు డైట్ లేదా టెట్‌ (TS TET)లో పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలు మార్చి 11వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ http://tsstudycircle.co.in/index.html లో అందుబాటులో ఉంటాయని ఎస్సీ స్టడీ సర్కిల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరణ

మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డీఎస్సీ దరఖాస్తు చేసుకున్న వారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఎడిట్ ఆప్షన్

తెలంగాణ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి ప్రత్యేకంగా అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ దరఖాస్తులను(TS DSC Applications 2024) ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Click Here for Direct Recruitment of TS DSC - 2024 అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. Edit Post Applied అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి Candidate's Aadhaar No, Payment Reference IDని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్మాత తిరిగి సబ్మిట్ చేయాలి.ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం