AP TET Results 2024 : ఏపీ టెట్ ఫైనల్ 'కీ' విడుదల - రిజల్ట్స్ లింక్ ఇదే-ap tet final keys 2024 released direct link to check the results on aptetapcfssin ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Results 2024 : ఏపీ టెట్ ఫైనల్ 'కీ' విడుదల - రిజల్ట్స్ లింక్ ఇదే

AP TET Results 2024 : ఏపీ టెట్ ఫైనల్ 'కీ' విడుదల - రిజల్ట్స్ లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 14, 2024 09:55 PM IST

AP TET Results 2024 Updates: ఆంధ్రప్రదేశ్ టెట్(AP TET) ఫైనల్ కీ అందుబాటులోకి వచ్చింది. https://aptet.apcfss.in/ వెబ్ సైట్లో వీటిని అందుబాటులో ఉంచారు. ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

ఏపీ టెట్ ఫలితాలు 2024
ఏపీ టెట్ ఫలితాలు 2024

AP TET Results 2024: ఏపీ టెట్ పరీక్షల ఫైనల్ కీలను విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. మార్చి 13వ తేదీనే పరీక్షలకు సంబంధించి ఫైనల్ కీ(AP TET Final Key) ని ప్రకటిస్తామని నిర్ణయించినప్పటికీ…. మార్చి 14వ తేదీన ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 14వ తేదీన ఫలితాలు కూడా విడుదల కావాలి. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫైనల్ కీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఫలితాలను కూడా ఇదే వెబ్ సైట్ లింక్ తో చెక్ చేసుకోవచ్చు.

yearly horoscope entry point

Download AP TET Final Key 2024 : ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 13వ తేదీ టెట్ ఫైనల్ కీలు(AP TET Final Key 2024) అందుబాటులోకి రావాలి. కానీ అలా కాకుండా మార్చి 14వ తేదీన ఫైనల్ కీలను వెబ్ సైట్ లో ఉంచింది. వాటిని ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  • టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు టెట్ వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే Final keys అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించిన పరీక్షల ఫైనల్ కీ లిస్ట్ కనిపిస్తుంది.
  • మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాశారో సంబంధింత సబ్జెక్ట్ పేరు పక్కన ఉంటే Click Here ఆప్షన్ పై నొక్కాలి.
  • మీ సబ్జెక్ట్ ఫైనల్ కీ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫైనల్ కీ కాపీని పొందవచ్చు.

Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • టెట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి... స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Whats_app_banner