TS DSC Open School Diploma: ఓపెన్ స్కూల్ డిప్లొమా అర్హతలతో తెలంగాణ టెట్, డిఎస్సీలకి నో ఛాన్స్
TS DSC Open School Diploma: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ డిప్లొమా విద్యార్హతలతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు అనుమతించ కూడదని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
TS DSC Open School Diploma: టెట్ TET 2024, తెలంగాణ డిఎస్సీలపై గంపెడాశలు పెట్టుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఎన్‌ఐఓఎస్ డిప్లొమా విద్యార్హతతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్షలకు అనుమతించకూడదని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎన్‌ఐఓఎస్ డిప్లొమా Dipolmaలను అనుమతించకూడదని నిర్ణయించారు. డిఎస్సీకి అర్హతగా పరిగణించే టెట్ TET 2024కు కూడా అనుమతించరు. ఓపెన్ స్కూల్ అందించే ఉపాధ్యాయ బోధనకు సంబంధించి ఓపెన్ స్కూల్ డిప్లొమా సర్టిఫికెట్లను అనుమతించకూడదని నిర్ణయించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ఓపెన్ స్కూల్ Open Schoolలో డిప్లొమా కోర్సులు చదివిన అభ్యర్థులు టెట్ దరఖాస్తులను పక్కన పెట్టనున్నారు. దీంతో వారికి ఈ ఏడాది డీఎస్సీకి చాన్స్ కూడా లేకుండా పోనుంది.
దాదాపు 25వేల మంది ఓపెన్ స్కూల్ డిప్లొమా సర్టిఫికెట్లతో టెట్‌కు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఓపెన్ స్కూల్ విధానంలో వివిధ రకాల కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష TET 2024 రాసే అవకాశం ఉండదని విద్యాశాఖ అధికారు తెలిపారు.
ఇప్పటికే టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని కూడా ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా డిఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెట్ పరీక్ష అర్హతలు,డిఎస్సీ అర్హతల విషయంలో ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నారు.తాజా నిర్ణయంతో దాదాపు 25 వేల మంది డీఎస్సీకి అర్హత కోల్పోతారని అంచనా వేస్తున్నారు.
NIOS నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించింది. వీటిని కూడా రెగ్యులర్ డీఎడ్ కోర్సులతో సమానంగా పరిగణించేవారు.
ఈ విద్యార్హతతో అభ్యర్థులు ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షలకు హాజరయ్యారు. టెట్ దరఖాస్తు సమయంలో అర్హత కాలమ్‌లో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ బదులు 'అదర్స్'గా దరఖాస్తు చేసుకునే వారు. గత జనవరిలో ఈ కోర్సులపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చింది. ఓపెన్ డిప్లోమాలపై స్పష్టమైన తీర్పునిచ్చింది.
ఓపెన్ డిప్లొమా కోర్సులు రెగ్యులర్ డీఎడ్‌తో సమానం కాదని ధర్మాసనం తేల్చింది. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్‌లతో ప్రైవేటు స్కూళ్లలో మాత్రమే టీచర్లుగా పనిచేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా వారిని అనుమతిస్తే సాంకేతిక సమస్యలు ఎదురై మొత్తం ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ఈ నేపత్యంలో టెట్, డీఎస్సీకి ఇప్పటికే ఎవరైనా ఎన్‌ఐఓఎస్ అర్హతలతో దరఖాస్తు చేసినా, వెరిఫికేషన్‌లో వారిని ప్రధాన పరీక్షలకు మినహాయించాలని నిర్ణయించారు.భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
టెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం…
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత(TS TET 2024) పరీక్ష అప్లికేషన్లు ఇవాళ్టి(మార్చి 27) నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. ఇవాళ ప్రారంభం కానున్న ఈ దరఖాస్తులు… ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
అర్హత కలిగిన అభ్యర్థులు . https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళికి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. జూన్ 6వ తేదీ వరకు జరుగుతాయి. జూన్ 12వ తేదీన టెట్ (TS TET Results 2024) ఫలితాలు విడుదల కానున్నాయి.
సంబంధిత కథనం