TS TET 2024 Updates : ఇవాళ్టి నుంచే తెలంగాణ 'టెట్' దరఖాస్తులు - ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు-ts tet 2024 application to start form today you can apply with this direct link ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Updates : ఇవాళ్టి నుంచే తెలంగాణ 'టెట్' దరఖాస్తులు - ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు

TS TET 2024 Updates : ఇవాళ్టి నుంచే తెలంగాణ 'టెట్' దరఖాస్తులు - ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 12:52 PM IST

TS TET 2024 Updates : తెలంగాణ టెట్ దరఖాస్తులు(TS TET Applications ) ఇవాళ్టి నుంచే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీని తుది గడువు ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

తెలంగాణ  టెట్ - 2024
తెలంగాణ టెట్ - 2024

Telangana State Teacher Eligibility Test 2024 Updates: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత(TS TET 2024) పరీక్ష అప్లికేషన్లు ఇవాళ్టి(మార్చి 27) నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. ఇవాళ ప్రారంభం కానున్న ఈ దరఖాస్తులు… ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు . https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళికి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. జూన్ 6వ తేదీ వరకు జరుగుతాయి. జూన్ 12వ తేదీన టెట్ (TS TET Results 2024)ఫలితాలు విడుదల కానున్నాయి.

How to Apply TS TET 2024 : ఇలా దరఖాస్తు చేసుకోండి

  • టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  • పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  • 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

TS TET Syllabus Download: మీ సబ్జెక్ట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి….

టెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నారో సదరు అభ్యర్థులు…. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోంపేజీలో Syllabus అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ మీ సబ్జెక్ట్ పేర్లు కనిపిస్తాయి. ఆ పక్కనే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తోంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు రాసే సబ్జెక్ట్ సిలబస్ కాపీని డౌన్లోడ్ అవుతుంది.

డౌన్లోడ్ చేసుకున్న కాపీని ప్రింట్ తీసుకోవచ్చు.

TS TET Key Dates 2024: టీఎస్ టెట్ ముఖ్య తేదీలు:

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ - 04, మార్చి, 2024.

దరఖాస్తులు ప్రారంభం -మార్చి 27, 2024.

దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 10, 2024.

హాల్ టికెట్లు - మే 15, 2024.

పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.

పరీక్షల ముగింపు - జూన్ 06,2024.

టెట్ ఫలితాలు - జూన్ 12, 2024.

అధికారిక వెబ్ సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS /

Whats_app_banner

సంబంధిత కథనం