TS DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్, రూ. 1500 బుక్ ఫండింగ్ కూడా..! ఇలా అప్లయ్ చేసుకోండి
Telangana DSC Free Coaching 2024: ఉచితంగా డీఎస్సీ కోచింగ్ పొందాలనుకునే వారికోసం తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఉచితంగా శిక్షణ ఇవ్వటమే కాకుండా రూ. 1500 బుక్ ఫండ్ ను ఇవ్వనుంది.
Telangana DSC Free Coaching 2024: ఫ్రీగా డీఎస్సీ కోచింగ్(Telangana DSC Free Coaching) పొందాలనుకుంటున్నారా…? అంతేకాకుండా…. బుక్స్ కూడా ఉచితంగా కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ. కోచింగ్ తీసుకోలేని ఆర్థిక స్థోమత లేని వారిని ఎంపిక చేసి ఫ్రీగా కోచింగ్ ఇవ్వటమే కాకుండా…. రూ. 1500 బుక్ ఫండ్ ను ఇవ్వనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ మార్చి 13వ తీదీన ప్రారంభం కాగా…ఏప్రిల్ 5వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫ్రీ కోచింగ్ ముఖ్య వివరాలు:
ఈ ఫ్రీ కోచింగ్ కోసం 10వేల మందిని ఎంపిక చేయనున్నారు. ఆయా జిల్లాల కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.
ఇందులో 7000 మంది ఎస్జీటీ అభ్యర్థులకు, 3000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ తెలిపింది.
ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్ ఫండ్‌తోపాటు స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందించనున్నారు.
అప్లయ్ చేసుకునే అభ్యర్ధి కుటుంబం వార్షికాదాయం రూ.5 లక్షలు మించకూడదు.
టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడాని అర్హులై ఉండాలి.
బీఎడ్, టెట్, డైట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 05, 2024.
040-29303130 ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చు.