AP Wine Shop Tenders 2024 : వైన్ షాపుల కోసం టెండర్లు వేస్తున్నారా.. అయితే ఈ 9 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి-9 key points to keep in mind for tender for wine shops in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Wine Shop Tenders 2024 : వైన్ షాపుల కోసం టెండర్లు వేస్తున్నారా.. అయితే ఈ 9 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

AP Wine Shop Tenders 2024 : వైన్ షాపుల కోసం టెండర్లు వేస్తున్నారా.. అయితే ఈ 9 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

AP Wine Shop Tenders 2024 : ఏపీలో కొత్త మద్యం పాలసీ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది. అయితే.. వైన్ షాపుల కోసం చాలామంది టెండర్లు వేయాలని భావిస్తున్నారు. కానీ.. ప్రాసెస్ తెలియక వెనకడుగు వేస్తున్నారు. టెండర్ ప్రాసెస్‌లో 9 కీలక అంశాలు ఇవే.

ఏపీలో కొత్త మద్యం పాలసీ

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలు రూపొందించింది. జిల్లాల వారీగా ఎన్ని వైన్ షాపులు ఉన్నాయో కూడా వెల్లడించింది. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మండలాల వారీగా వైన్ షాపుల వివరాలు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది.

టెండర్ ప్రాసెస్ ఇలా..

1. నూతన మద్యం షాపులకు అప్లై చేసుకునే వారు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాలి.

2. అప్లికేషన్, ఎంట్రీ ఫీజు రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఈ అప్లికేషన్, ఎంట్రీపాస్ ఫీజును ఆన్‌లైన్, హైబ్రిడ్, ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా చెల్లించవచ్చు.

3. ఎంట్రీ పాస్ ఫీజు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ ఫండ్. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

4 .రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వారికి ఎక్సైజ్ అధికారులు ఎంట్రీ పాస్ ఇస్తారు.

5.ఎంట్రీ పాస్ తీసుకున్న వ్యక్తులు.. అక్టోబర్ 11న డ్రా తీసే దగ్గరకు వెళ్లాలి. (జిల్లా కేంద్రాల్లో డ్రా తీసే అవకాశం ఉంటుంది.)

6 .జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అప్లై చేసుకున్న వారి సమక్షంలో బహిరంగంగా లాటరీ తీస్తారు.

7. డ్రాలో వైన్ షాపులు దక్కించుకున్నవారు రూ.65 లక్షలు రెండేళ్ల కాల పరిమితిలో.. ఆరుసార్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

8. వైన్ షాపు దక్కించుకున్న వారు.. అదే రోజు లేదా మరుసటి రోజున (1/6) అంటే సుమారు రూ.11 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి.

9. నగదును చెల్లించిన మరుసటి రోజు నుంచి నూతన మద్యం షాపుల వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు.