UAE Jobs : టామ్‌కామ్‌ నుంచి కీలక ప్రకటన.. యూఏఈలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి-tomcom suggests to apply for delivery boys jobs in uae ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Uae Jobs : టామ్‌కామ్‌ నుంచి కీలక ప్రకటన.. యూఏఈలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

UAE Jobs : టామ్‌కామ్‌ నుంచి కీలక ప్రకటన.. యూఏఈలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

UAE Jobs : డెలివరీ బాయ్స్‌ జాబ్స్‌కు యూఏఈలో డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం ఆ దేశంలో డెలివరీ బాయ్స్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. టామ్‌కామ్‌ కీలక ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ సూచించింది.

యూఏఈలో ఉద్యోగాలు

యూఏఈ.. డెలివరీ బాయ్స్‌ కొరత ఎదుర్కొంటుంది. దీంతో డెలివరీ బాయ్స్ ఉద్యోగులను ఆ దేశం ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ ఉద్యోగాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్‌ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్) సూచించింది. 21 నుంచి 40 ఏళ్లలోపు యువత ఈ ఉద్యోగాలకు అర్హులని స్పష్టం చేసింది.

దీని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి.. మూడేళ్లుగా టూవీలర్‌ లైసెన్సు ఉండాలని టామ్‌కామ్‌ సీఈవో వివరించారు. ఆసక్తి కలిగిన యువత తమ తాజా రెజ్యూమెను tomcom.resume@gmail.com కు పంపించాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే.. 9440051285, 9440048500, 9701040062, 9440051452 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు.

ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. సురక్షితమైన, చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతుందని టామ్ కామ్ స్పష్టం చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా టామ్ కామ్ సహాయం చేస్తుందని.. సీఈవో స్పష్టం చేశారు.

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) రిక్రూట్మెంట్ ఏజెన్సీ.. విదేశీ ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది. యూఎస్ఏ, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాలలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తోంది. చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా.. అర్హత కలిగిన అభ్యర్థులకు శిక్షణ, భాష నైపుణ్యాలను అందిస్తోంది.

విదేశీ ఉద్యోగ నియామకాలు అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలతో టామ్ కామ్ భాగస్వామ్యం కలిగి ఉంది. అందులో భాగంగా వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల గురించి సమాచారం అందిస్తోంది.