TGRTC PRC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. పీఆర్సీపై కీలక ప్రకటన!
- TG RTC PRC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా శుభవార్త చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. కారుణ్య నియామకాలపైనా కీలక ప్రకటన చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- TG RTC PRC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా శుభవార్త చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. కారుణ్య నియామకాలపైనా కీలక ప్రకటన చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(1 / 5)
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై దసరా లోపు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దసరా లోపు పీఆర్సీపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. (@tgsrtcmdoffice)
(2 / 5)
ఆర్టీసీలో ఉద్యోగా భర్తీ, కార్మికులకు పీఆర్సీ, కారుణ్య నియామకాల సమస్యలన్ని దసరా లోపు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల కోసం కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. (@tgsrtcmdoffice)
(3 / 5)
కరీంనగర్ నుంచి హైదరాబాద్ రూట్ లో 35 బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.(@tgsrtcmdoffice)
(4 / 5)
గతంలో 15 వేల ఆర్టీసీ బస్సులు ఉంటే.. గత పాలకుల నిర్లక్ష్యంతో 9500 తగ్గాయని మంత్రి పొన్నం ఆరోపించారు. ఫ్రీ బస్ సౌకర్యంతో బస్సులు కావాలనే డిమాండ్ ప్రస్తుతం ఉందన్నారు. నూతనంగా ఆర్టీసీ-ప్రభుత్వ భాగస్వామ్యంతో బస్సులు కొనుగోలు చేస్తుందన్నారు. మహిళా సమాఖ్యలు, మెప్నా ద్వారా బస్సులు కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. (@tgsrtcmdoffice)
ఇతర గ్యాలరీలు