తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Strategy : కేసీఆర్ ఫిక్స్ అయ్యారా..? పదే పదే వాటినే ఎందుకు చెబుతున్నారు..?

KCR Strategy : కేసీఆర్ ఫిక్స్ అయ్యారా..? పదే పదే వాటినే ఎందుకు చెబుతున్నారు..?

07 September 2022, 6:32 IST

google News
    • KCR Comments On BJP: జిల్లాల పర్యటనకు వెళ్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కొత్త అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. మొన్నటి వరకు కేంద్రంపై యుద్ధం చేద్దామన్న ఆయన... తాజాగా ఢిల్లీలో వచ్చేది మన ప్రభుత్వమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే... జనాలను ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లేలా అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)

KCR Strategy for Next Elections: ‘దేశ రాజకీయాల్లోకి పోదామా? ఎంత దాకైనా తెగిద్దామా..? దేశం కోసం తెలంగాణ గడ్డ నుంచి పోరాటం చేయాలి. 2024 తర్వాత కేంద్రంలో రైతులకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. బావుల దగ్గర మీటర్ పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. మనమంతా ఒక్కటై వానికే మీటర్ పెట్టాలె. మన ప్రభుత్వం వచ్చాకా దేశమంతా ఉచిత కరెంట్ ఇద్దాం' ఇవి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. అయితే గత కొంత కాలంగా ఈ తరహా కామెంట్స్ చేస్తున్న గూలాబీ బాస్ తాజాగా వచ్చేది మన సర్కారే అని చెప్పటం మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే కేసీఆర్ పక్కా స్కెచ్ తోనే అడుగులు వేసున్నారా..? జిల్లాల పర్యటనలో కేవలం బీజేపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? ఎన్నికల మూడ్ లోకి వెళ్లారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

సమీకృత జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పలు జిల్లాలకు వెళ్తున్నారు కేసీఆర్. అదే సమయంలో జిల్లా పార్టీ ఆఫీసులను కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాలకు వెళ్లిన కేసీఆర్... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలకు హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగం కంప్లీట్ గా మారిపోయింది. రాష్ట్ర ప్రగతిని చెబుతూనే... సూటిగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ ముచ్చటే ఎత్తటం లేదు. పచ్చని పంటలు కావాలా..మత పిచ్చి మంటలు కావాలా అంటూ ప్రజలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెబుతూ వస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో వెళ్దామని... బీజేపీ ముక్త్ భారత్ అంటూ నినాదాన్ని ఇస్తున్నారు.

ఓ అంచనాకు వచ్చారా..?

ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే కేసీఆర్ ఓ అంచనాకు వచ్చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పలు సర్వే రిపోర్టులను తెప్పించుకొని వ్యూహలను సిద్ధం చేసే పనిలో పడిన కేసీఆర్.. జిల్లాల పర్యటనకు వెళ్తూ అసలు పనిని కూడా మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందే...ఏ ప్రభుత్వం కావాలి..ఏ పార్టీ కావాలి అంటూ ప్రజలను ఆలోచింపజేసేలా విషయాన్ని చెబుతున్నారు. మీటర్ల విషయాన్ని ప్రస్తావించని సభ అంటూ లేదు. ఎక్కడి వెళ్లిన మీటర్లు పెట్టే బీజేపీ కావాలా లేక మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా అంటూ రైతులకు ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా జనాలను వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ చేసే పనిలో కేసీఆర్ ఉన్నారా అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. అయితే తన ప్రసంగంలో కాంగ్రెస్ ను ఎక్కడా విమర్శించటం లేదు కేసీఆర్. అయితే వ్యూహంలో భాగంగానే వారి ప్రస్తావన చేయటం లేదా.. లేక దూకుడుగా ఉన్న బీజేపీకి అడ్డుకట్టే వేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారనే చర్చ నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికతో సవాల్ విసిరిన బీజేపీకి... ఎలాగైనా అడ్డుకట్ట వేసి సాధారణ ఎన్నికల ముందు భారీ దెబ్బ కొట్టాలని చూస్తున్నారని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మిషన్ తెలంగాణతో పక్కా ప్లాన్ తో ఉన్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో అసలు ప్రత్యర్థి అని కేసీఆర్ ఫిక్స్ అయ్యారా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులతో పాటు దీటైన నేతలు కూడా ఉన్నప్పటికీ.. వారి ప్రస్తావన ఎందుకు తీసుకువరావటం లేదనేది కూడా ఆసక్తికరంగా మారింది.

జిల్లాల సభలను కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలుగా మలుచుకున్నారనే చర్చ ఉంది. జాతీయ రాజకీయాల్లో వెళ్లే క్రమంలోనే బీజేపీపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తారని టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ... సీబీఐ, ఈడీ దాడులుంటాయని కూడా హింట్ ఇస్తోంది. తెలంగాణలో వచ్చేది తమ సర్కారే అంటూ మాటల దాడిని పెంచుతోంది. వీటన్నింటిని అంచనా వేసుకున్న కేసీఆర్.. ఎన్నికలకు ముందే కమలదళానికి బ్రేక్ లు వేయాలని చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కలెక్టర్ల ఓపెనింగ్, పార్టీ ఆఫీసు కార్యక్రమాల ప్రారంభోత్సవ సభల్లో పక్కా ప్లాన్ తోనే ప్రసంగిస్తున్నారని తెలుస్తోంది. ప్రజలను నాడి పట్టడంలో దిట్ట అయిన కేసీఆర్... వారిని ముందస్తుగానే ఆలోచనలో పడేశాలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది

మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరు... ఎవరి పోటీ ఇస్తారు అనే దానిపై కేసీఆర్ ఓ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నారా..? బీజేపీనే తమ ప్రత్యర్థి అని ఫిక్స్ అయ్యారా..? కాంగ్రెస్ ను కావాలనే డైలామాలో పడేస్తున్నారా అనే అంశాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంటుంది.

తదుపరి వ్యాసం