తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mim Vs Brs In Assembly: సర్కార్ పై అక్బరుద్దీన్ సీరియస్ కామెంట్స్… Ktr కౌంటర్

MIM vs BRS in Assembly: సర్కార్ పై అక్బరుద్దీన్ సీరియస్ కామెంట్స్… KTR కౌంటర్

HT Telugu Desk HT Telugu

04 February 2023, 13:17 IST

    • TS Assembly Budget Sessions Updates 2023: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతున్నాయి. అయితే గవర్నర్ ప్రసంగం, పాతబస్తీకి నిధుల అంశంలో MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేయగా… మంత్రి కేటీఆర్ గట్టిగా బదులిచ్చారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం
అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం

అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం

MIM vs BRS in TS Assembly Budget Sessions 2023:తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగించగా.. శనివారం గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ... ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్చం చేశారు. ప్రసంగంలో అన్ని అంశాలు ప్రస్తావించలేదని.. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాలు పేర్కొనలేదా.. లేక గవర్నర్‌ తొలగించారా అని నిలదీశారు. అసలు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా అని ఘాటుగా మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

పాతబస్తీ అభివృద్ధిపై మాట్లాడిన అక్బరుద్దీన్… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ర్దూకు రెండవ అధికార భాషా తెలంగాణ సర్కార్ ఇచ్చిందని, కానీ ఉర్దూకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీలు కడుతున్నారని… కానీ హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి… పాతబస్తీ లో ఆ స్థాయిలో జరగడం లేదని దుయ్యబట్టారు. పాతబస్తీ లో మెట్రో సంగతి అంతేనా అని సర్కార్ ను నిలదీశారు. అసెంబ్లీ లో సర్కార్ హామీలు ఇస్తుంది కానీ… బయట అమలు కావటం లేదని తీవ్ర అసహన వ్యక్తం చేశారు.

అయితే అక్బరుద్దీన్ ఓవైసీ పై మంత్రి కేటీఆర్ సీరియస్‌ అయ్యారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదంటూ కామెంట్స్ చేశారు. బీఏసీ సమావేశానికి అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదన్నారు. అసలు ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో కాసేపు సభలో ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు సీన్ మారింది.

సభ ప్రారంభం కాగానే అసెంబ్లీలో.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించారు. మరో శాసనసభ్యుడు ఆ తీర్మానాన్ని వివేకానందగౌడ్ బలపరిచారు. ఈ సందర్భంగా అదానీ వ్యవహరాన్ని ప్రస్తావించారు ఎమ్మెల్యే వివేకానందగౌడ్. కేంద్రం అదానీ లాంటి వాళ్లకు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవే అని విమర్శించారు. హైదరాబాద్ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.దీంతో సభలోని బీజేపీ సభ్యులు.. వివేకానంద ప్రసంగానికి అడ్డుతగిలారు. ఫలితంగా కాసేపు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది.

శాసనసభలో బీఏసీ సమావేశ నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ సభ్యులకు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 8వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుందని పేర్కొన్నారు. 9, 10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ, 12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగుతుందని స్పష్టం చేశారు.