Amit Jogi Meets CM KCR: సీఎం కేసీఆర్‌తో అమిత్‌జోగి భేటీ - రాజకీయాలపై చర్చ-janata congress party president amit jogi meets cm kcr at hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Janata Congress Party President Amit Jogi Meets Cm Kcr At Hyderabad

Amit Jogi Meets CM KCR: సీఎం కేసీఆర్‌తో అమిత్‌జోగి భేటీ - రాజకీయాలపై చర్చ

HT Telugu Desk HT Telugu
Feb 01, 2023 10:28 PM IST

BRS Latest News: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ జోగి భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు.

సీఎం కేసీఆర్ తో అమిత్‌జోగి భేటీ
సీఎం కేసీఆర్ తో అమిత్‌జోగి భేటీ

Amit Jogi meets cm kcr at hyderabad: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ జోగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చిన అమిత్ జోగీ.. కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై చర్చించారు.

బీఆర్ఎస్ జాతీయ పార్టీ విధి విధానాలను కేసీఆర్ ను అమిత్ జోగీ అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తుల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆహ్వానించారు అజిత్ జోగీ. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేశారని ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు అమిత్ జోగీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహూకరించారు. కాగా... జనతా కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.

ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ విజయవంతం కావడంతో.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న భారత రాష్ట్ర సమితి నిర్వహించనుంది. ‘తెలంగాణ వెలుపల బిఆర్‌ఎస్‌కి ఇది మొదటి సమావేశం. కేసీఆర్ (కె.చంద్రశేఖర్ రావు) ఈ సభలో ప్రసంగించనున్నారు. నాందేడ్ ప్రాంతానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సభకు ముందు కేసీఆర్ నాందేడ్‌లోని ప్రసిద్ధ గురుద్వారాను సందర్శించి, సమావేశానికి ముందు ప్రార్థనలు చేసే అవకాశం ఉంది.

మరోవైపు ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభం కానుంది, ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కూడా బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్, జెడి(యు) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం