తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc Announced Hyderabad Darshan Package Check Full Details Are Here

TSRTC Hyderabad Darshan : హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్రాంతాలన్నీ చూడొచ్చు, మీ కోసమే ఈ వీకెండ్ ప్యాకేజీ

31 May 2023, 14:35 IST

    • TSRTC Hyderabad Darshan: టూరిస్టుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. వీకెండ్ లో హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్రాంతాలన్నీ కవర్ చేసేలా ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా పేర్కొంది.
తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

SRTC Hyderabad Darshan Package:గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. మరోవైపు పక్క రాష్ట్రాలకు కూడా సరికొత్త సర్వీసులను నడుపుతోంది. తాజాగానే రూట్ పాస్ సర్వీస్ ను తీసుకురాగా... మరో వినూత్న నిర్ణయాన్ని ప్రకటించింది. హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్రాంతాలన్నీ చూసేలా సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

జస్ట్ 12 గంటల్లోనే...

ఈ ప్యాకేజీ లో భాగంగా కేవలం 12 గంటల్లో హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్రాంతాలను చూడొచ్చు. ఏసీ, నాన్ ఏసీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. శని, ఆదివారాల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం 8గంటల 30నిమిషాల నుంచి రాత్రి 8గంటల 30నిమిషాల వరకు నగరంలోని పలు సందర్శనా స్థలాలను చూపిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర్లోని అల్పా హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. బిర్లామందిర్, గోల్కొండ, తారామతి, బారాదారి, చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్, లుంబినీ పార్కు ప్రాంతాలకు తీసుకెళ్తోంది. గైడ్ లు కూడా అందుబాటులో ఉంటారు. ఇక కాలనీలో 25మంది అంతకంటే ఎక్కువ ఉంటే బస్సును నేరుగా కాలనీకే పంపిస్తారు. www.tsrtconline.in  వెబ్ సైట్ లో హైదరాబాద్ దర్శన్ టికెట్టు బుక్ చేసుకోవచ్చు.

కొత్తగా 'జనరల్ రూట్ పాస్'…

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణాలు చేసే వారికి సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. కొత్తగా ‘జనరల్ రూట్ పాస్’కు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలువు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు.