RRR అంటే రాష్ట్ర రోడ్డు రవాణా.. ఎత్తర జెండా సాంగ్‌తో ఆర్టీసీని ప్రమోట్ చేస్తున్న సజ్జనార్.. వీడియో
RRR అంటే రౌద్రం రణం రుధిరం.. ఇది సినిమా వాళ్లు పెట్టుకున్న పేరు. కానీ అదే ఇప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణాగా మారిపోయింది. ఎందుకు? ఎలా? ఏంటా కథ?
ఓ సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళిని మించిన దర్శకుడు లేడు. భారీ చిత్రాన్ని తీయడం కాదు.. అంతకంటే భారీగా దానిని ప్రమోట్ చేయడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. ఈగ సినిమా అయినా, తర్వాత బాహుబలి అయినా రిలీజ్‌కు ముందు అతని హంగామా మామూలుగా ఉండదు. తన సినిమా ఎప్పుడూ జనాల నోళ్లలో నానుతుండాలని అనుకుంటాడు. అసలు రిలీజ్‌కు ముందే ఆ సినిమా బడ్జెట్‌లో సగమైనా నిర్మాతకు సంపాదించి పెడతాడు.
ట్రెండింగ్ వార్తలు
అయితే అంతటి రాజమౌళి ఘనమైన RRR మూవీని ఇప్పుడు మన టీఎస్‌ఆర్టీసీ తన ప్రమోషన్ కోసం వాడుకుంటుండటం విశేషం. ఈ మధ్యే మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఎత్తర జెండా సాంగ్ ఆర్టీసీని ఎత్తేస్తోంది. సైబరాబాద్ కమిషనర్ పోస్ట్ నుంచి ఆర్టీసీ ఎండీగా బదిలీ అయిన తర్వాత నష్టాల్లో ఉన్న ఈ సంస్థను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న వీసీ సజ్జనార్.. ఇలా ఆర్‌ఆర్‌ఆర్ సాంగ్‌తో బస్సులను ప్రమోట్ చేస్తుండటం విశేషం.
అసలు RRRకు అర్థమే మార్చేశారాయన. ఆర్‌ఆర్‌ఆర్ అంటే రాష్ట్ర రోడ్డు రవాణా. చివరికి పాటలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎత్తిన జెండాపై కూడా టీఎస్‌ఆర్టీసీ అక్షరాలు, లోగో, బస్సు ప్రత్యక్షమయ్యాయి. ఈ వినూత్న ప్రచారం జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాటను వీసీ సజ్జనార్ కార్యాలయం అధికారిక ట్విటర్ అకౌంట్ షేర్ చేసింది. అంతేకాదు దీనికి రాజమౌళి, ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ అకౌంట్‌లను కూడా ట్యాగ్ చేయడం విశేషం. ఈ ఐడియా చాలా మందికి నచ్చడంతో వేల కొద్దీ లైక్స్, వందల కొద్దీ కామెంట్స్ వస్తున్నాయి.
సంబంధిత కథనం