తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Weather Update Heavy Rains Are Likely For Three Days In Many Districts Of Telangana

TS Weather Update :తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్ష సూచన

HT Telugu Desk HT Telugu

14 March 2023, 8:47 IST

    • TS Weather Update  తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న మూడ్రోజుల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  తెలంగాణలో వేడి, ఉక్కపోతల నుంచి ఉపశమనం ఇచ్చేలా  వాతావరణ చల్లబడుతుందని తెలిపారు. 
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

TS Weather Update రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, వాతావరణ శాఖ డైరెక్టర్‌ నాగరత్న సూచించారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Sircilla District : సిరిసిల్లలో తీగ లాగితే... కంబోడియాలో డొంక కదిలింది..! సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

TS POLYCET 2024 Updates : నేటితో ముగియనున్న పాలిసెట్‌ దరఖాస్తుల గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

TS Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

16వ మధ్యాహ్నం నుంచి నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉంటుంది.

17వ తేదీన నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల గాలి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు.

భద్రాద్రి జిల్లా నాయుడుపేటలో 39.8 డిగ్రీలు...

మరోవైపు మార్చి రెండో వారంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలపైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాయుడుపేటలో 39.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. భద్రాచలంలో సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల నమోదయింది.

వనపర్తి జిల్లా పెబ్బేరులో 39.1, ఆదిలాబాద్‌ జిల్లా జీఎస్‌ఈ ఎస్టేట్‌లో 39.1, జగిత్యాల జిల్లా ఎండపల్లి, పెద్దపల్లి జిల్లా మంథనిలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌, నల్గొండ, నిజామాబాద్‌, రామగుండం, మెదక్‌లలో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. రాత్రిపూట కూడా చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా మరికొన్ని జిల్లాల్లో తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది.

మరోవైపు వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ బాద్, వరంగల్, హన్మ కొండ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు రావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి రాష్టం మీదకు వీస్తున్నాయని రాష్ట్రానికి వర్షాలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15, 16,17 వ తేదీలలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.