తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Polycet 2024 Updates : నేటితో ముగియనున్న పాలిసెట్‌ దరఖాస్తుల గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

TS POLYCET 2024 Updates : నేటితో ముగియనున్న పాలిసెట్‌ దరఖాస్తుల గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

28 April 2024, 6:17 IST

    • TS POLYCET 2024 Application Updates: తెలంగాణ పాలిసెట్ -2024 (TS POLYCET) ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. మే 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ పాలిసెట్ 2024
తెలంగాణ పాలిసెట్ 2024

తెలంగాణ పాలిసెట్ 2024

TS POLYCET 2024 Applications Updates: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తుల(TS POLYCET) గడువు ఇవాళ్టి(ఏప్రిల్ 28)తో ముగియనుంది. ఆలస్య రుసుం లేకుండా ఇప్పటికే గడువు పొడిగించిన రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ, ట్రైనింగ్ బోర్డు… మరోసారి పొడిగించే అవకాశం లేదు. ఫలితంగా అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా…. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS EAPCET Results 2024 : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్ సైట్ లో ప్రిలిమినరీ 'కీ'లు, ఫలితాలు ఎప్పుడంటే..?

TSRTC On Jeevan Reddy : జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు, ఇంకా రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించాలి- టీఎస్ఆర్టీసీ

TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TS Wines Shops Close : ఇవాళ్టి నుంచే వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?

పదో తరగతి(SSC Exams) లేదా త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ 2024కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ. 250, ఇత‌రులు రూ. 500 ఫీజు చెల్లించి… ఇవాళ్టి వరకు (ఏప్రిల్ 28) అప్లికేషన్లను సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష మే 24వ తేదీన జరగనుంది. రాత పరీక్ష నిర్వహించిన పన్నెండు రోజుల్లో ఫలితాలను ప్రకటించునున్నారు.

ముఖ్య వివరాలు:

  • ఎంట్రెన్స్ పరీక్ష - తెలంగాణ పాలిసెట్ - 2024
  • 2024-25 విద్యాసంవ‌త్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహిస్తారు.
  • పదో తరగతి(SSC Exams) లేదా త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ రాత‌ప‌రీక్షకు అప్లై చేసుకోవ‌చ్చు.
  • ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ. 250, ఇత‌రులు రూ. 500 ఫీజు చెల్లించి ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • మే 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
  • పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://polycet.sbtet.telangana.gov.in/
  • పాలిసెట్‌ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి
  • polycet-te@telangana.govi.inకు మెయిల్ కూడా చేయవచ్చు.

NOTE : https://polycet.sbtet.telangana.gov.in/#!/index/Registration ఈ లింక్ పై క్లిక్ చేసి పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ పాలీసెట్‌ 2024 ద్వారా పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ 2024 నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. పాలీసెట్ 2024 (Polycet) ద్వారా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కల్పిస్తారు. పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రశేశ పరీక్ష - పాలీసెట్‌ 2024 ద్వారా విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

తదుపరి వ్యాసం