తెలుగు న్యూస్ / ఫోటో /
AP Polycet 2024 Key : ప్రశాంతంగా ముగిసిన ఏపీ పాలిసెట్, ఈ నెల 30న ప్రాథమిక కీ విడుదల
- AP Polycet 2024 Key : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,41,978 (88.74 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 30న పాలిసెట్ కీ విడుదల చేయనున్నారు.
- AP Polycet 2024 Key : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,41,978 (88.74 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 30న పాలిసెట్ కీ విడుదల చేయనున్నారు.
(1 / 6)
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 442 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
(2 / 6)
ఈ ఏడాది పాలిసెట్ -2024కు మొత్తం 1,59,989 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 1,41,978 (88.74 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, రవాణా తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో పరీక్ష సజావుగా నిర్వహించారు.
(3 / 6)
పాలిసెట్ పరీక్ష నేపథ్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాద నాగరాణి వివిధ కేంద్రాలను వ్యక్తిగతంగా పరిశీలించారు. సురేష్ కుమార్ విజయవాడ నగరంలోని ఆంధ్రా లయెలా కళాశాలను సందర్శించగా, నాగరాణి వివిధ జిల్లాలలోని ప్రవేశ పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
(4 / 6)
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని చదలవాడ నాగరాణి తొలుత తనిఖీ చేశారు. అనంతరం ఏలూరు జిల్లా కోటదిబ్బలోని కస్తూరిబా పురపాలక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏలూరు పట్టణంలోని సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కేంద్రాలను పరిశీలించారు.
(5 / 6)
ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ... ప్రశ్న పత్రం ప్రాథమిక కీ(AP Polycet Key) ఏప్రిల్ 30వ తేదీన https://apsbtet.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు.
ఇతర గ్యాలరీలు