AP Polycet Hall Tickets: ఆన్‌లైన్‌లో ఏపీ పాలీసెట్ 2024, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల..
AP Polycet Hall Tickets: మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2024 హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. దీంతో పాటు ఆదర్శ పాఠశాలల హాల్ టిక్కెట్లు కూడా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషనర్ ప్రకటించారు.
AP Polycet Hall Tickets: ఆంధ్రప్రదేశ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలీసెట్ 2024 హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. బుధవారం నుంచి ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్ధులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి సూచించారు.
April 27 ఏప్రిల్ 27న పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. polytechnic courses పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల కోసం అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. హాల్ టిక్కెట్లను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చ. https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ - 2024కు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 5వరకు దరఖాస్తుల స్వీకరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా… ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఏప్రిల్ 27వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను చూడొచ్చు.
ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ప్రవేశాలకు హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ model Schools ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21 న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ School Education ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.
ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు తెలిపారు.
తెలంగాణ పాలిసెట్ 2024 షెడ్యూల్
Telangana Polycet 2024: పదో తరగతి విద్యార్హతతతో సాంకేతిక విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పాలిటెక్నిక్ 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ సాంకేతిక విద్యా మండలి ఇప్పటికే విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణ పాలీసెట్ 2024 ద్వారా పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.
వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ 2024 నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. పాలీసెట్ 2024 Polycet 2024 ద్వారా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కల్పిస్తారు. పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - పాలీసెట్ 2024 ద్వారా విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
సంబంధిత కథనం