AP POLYCET 2024 Updates: ఏపీ పాలిసెట్(AP Polytechnic Common Entrance Test) దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం…. ఏప్రిల్ 5వ తేదీతో ఈ గడువు ముగిసినప్పటికీ అధికారులు… గడవును పెంచారు. ఐదు రోజులు పెంచగా… ఏప్రిల్ 10తో పూర్తి కానుంది. అర్హత గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లికేషన్ సమర్పించుకోవచ్చు ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా… ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను కల్పిస్తారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉచితంగా కోచింగ్(AP Polycet Free Coaching) ఇస్తున్నారు. ఈ తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. . అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఏప్రిల్ 25 వరకు నిరవధికంగా క్లాసులు జరుగుతాయని ఏపీ సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. 87 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ఈ క్లాసులు జరుగుతున్నాయి. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలలో సిద్దం చేసిన ఉచిత పాలిసెట్ కోచింగ్ మాటీరియల్‌ను హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్దికి అందిస్తున్నారు.
విద్యార్థులకు ఉచితంగా ఫ్రీ స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది ఏపీ సాంకేతిక విద్యాశాఖ. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఈ స్టడీ మెటీరియల్ (AP POLYCET Study Material 2024)కాపీని పొందవచ్చు. అయితే పాలిసెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్తులు… ఈ మెటిరీయల్ ను ఎలా పొందాలో ఇక్కడ చూడండి…