AP Polycet Admissions: పాలిటెక్నిక్‌ తుది విడత అడ్మిషన్ షెడ్యూల్ విడుదల-polytechnic final phase admission schedule released by department of technical education ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Polycet Admissions: పాలిటెక్నిక్‌ తుది విడత అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

AP Polycet Admissions: పాలిటెక్నిక్‌ తుది విడత అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

HT Telugu Desk HT Telugu
Aug 29, 2023 07:36 AM IST

AP Polycet Admissions: ఏపీలో పాలిటెక్నిక్ తుది విడత అడ్మిషన్ షెడ్యూల్‌ను ఏపీ సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్‌ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ పాలిసెట్ 2023
ఏపీ పాలిసెట్ 2023

AP Polycet Admissions: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్కాలేజీల్లో పాలిసెట్ తుది విడత ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పాలిసెట్ తుది దశ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్ట్ 30 నుండి ప్రారంభం కానుందని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, పాలిటెక్నిక్ అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

ఆగస్టు 29వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అందుబాటులో రానుంది. విధ్యార్ధులు ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 1 వరకు ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ ల పరిశీలన పూర్తి చేసుకోవాలసి ఉందన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ లోపు నాలుగు రోజుల వ్యవధిలో వెబ్‌ ఆప్షన్స్‌ ఎంపిక పూర్తి చేయాలని కన్వీనర్ స్పష్టం చేసారు.

సెప్టెంబర్ 4 వ తేదీన విద్యార్ధులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు నాలుగు రోజుల వ్యవధిలో విద్యార్ధులు అయా కళాశాలల్లో రిపోర్టు చేయవలసి ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో క్లాసులు ఇప్పటికే ప్రారంభం అయినందున విద్యార్థులు వేగంగా ప్రవేశాలు పొందాలని చదలవాడ నాగరాణి స్పష్టం చేసారు.

స్పాట్‌ అడ్మిషన్లు రద్దు…

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. ప్రతి ఏడాది పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మిగిలిపోయిన సీట్లకు కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తారు. పాలిటెక్నిక్‌లలో మేనేజ్‌మెంట్‌ కోటా ఉండకపోవడంతో కన్వీనర్‌ కోటాలో కోరుకున్న సీటు రాని విద్యార్థులు స్పాట్‌లో దరఖాస్తు చేసుకుంటారు.

పాలిసెట్‌లో అర్హత సాధించని వారు, సెట్‌ రాయని వారు కూడా నేరుగా అడ్మిషన్లు పొందుతారు. సుదీర్ఘకాలం నుంచి పాలిటెక్నిక్‌ అడ్మిషన్లలో ఈ విధానం ఉంది. ఈ ఏడాది నుంచి దానిని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పాట్‌ కోటాలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ప్రభుత్వమిచ్చే ఎలాంటి పథకాలూ వర్తించవని స్పష్టం చేసింది.

ఫీజులు కూడా విద్యార్దులు సొంతంగానే కట్టుకోవాల్సి ఉంటుంది. ఏటా సుమారు 10శాతం మంది విద్యార్థులు స్పాట్‌ కోటాలో సీట్లు పొందుతుండగా ఇకపై వాటిని రద్దు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫలితాలు వెల్లడించిన 81 రోజులకు పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ లో చేరిపోయారు. ఈ ఏడాది పాలిటెక్నిక్‌లలో సగం సీట్లు కూడా భర్తీకాలేదు. 269 పాలిటెక్నిక్‌లలో 82,729 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 34,122 (41.2శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 36.6శాతం సీట్లే నిండాయి. ప్రైవేటు యాజమాన్యాలు కూడా స్పాట్‌ అడ్మిషన్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఎక్కడా సీటు రానివారు స్పాట్‌ ద్వారా సీట్లు పొందుతారని, దానివల్ల తమ అడ్మిషన్లు పెరుగుతాయని భావించగా వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Whats_app_banner