AP POLYCET 2024 Registration : ఏపీ పాలిసెట్(Andhra Pradesh Polytechnic Common Entrance Test 2024) ఆన్ లైన్ దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…ఇవాళ్ఠి (ఏప్రిల్ 5)తో ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావాలి. అయితే ఈ గడువును మరో ఐదురోజుల పాటు పొడిగించారు. ఫలితంగా ఏప్రిల్ 10వ తేదీ వరకు విద్యార్థులు… ఏపీ పాలిసెట్ కు(AP POLYCET 2024) అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా… ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నారు. https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.
AP Polycet Application Fee: ఏపీ పాలిసెట్ కు దరఖాస్తు చేసుకునే ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.
అర్హతలు - పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మార్చి, ఏప్రిల్ లో పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉచితంగా కోచింగ్(AP Polycet Free Coaching) ఇస్తున్నారు. ఈ తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. . అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఏప్రిల్ 25 వరకు నిరవధికంగా క్లాసులు జరుగుతాయని ఏపీ సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. 87 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ఈ క్లాసులు జరుగుతున్నాయి. తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలలో సిద్దం చేసిన ఉచిత పాలిసెట్ కోచింగ్ మాటీరియల్‌ను హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్దికి అందిస్తున్నారు.