TS PolyCET 2024 : తెలంగాణ పాలిసెట్ పరీక్ష వాయిదా, మే 24న ఎగ్జామ్
TS PolyCET 2024 : తెలంగాణ పాలిసెట్ పరీక్ష వాయిదా పడింది. లోక్ సభ ఎన్నికల కారణంగా మే 17 నిర్వహించాల్సిన పరీక్షను మే 24కు వాయిదా వేశారు.
TS PolyCET 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections)నేపథ్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష(TS PolyCET 2024) వాయిదా పడింది. మే 17న నిర్వహించాల్సిన పరీక్షను మే 24కు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ, ట్రైనింగ్ బోర్డు ప్రకటించింది. తెలంగాణ పాలిసెట్-2024 నోటిఫికేషన్(PolyCET Notification) ఇటీవల విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించనున్నారు. పదో తరగతి(SSC Exams) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుతం ఎస్ఎస్సీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్ రాతపరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా, ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 22 వరకు అప్లికేషన్లు(PolyCET Applications) స్వీకరించనున్నారు.
ఫీజు వివరాలు
మే 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ. 250, ఇతరులు రూ. 500 ఫీజు(TS PolyCET Fee) చెల్లించి ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 24 వరకు రూ. 100 ఆలస్య రుసుంతో, ఏప్రిల్ 26 వరకు రూ. 300 ఆలస్య రుసుంతో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://polycet.sbtet.telangana.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవొచ్చు.
ఏ కోర్సుల్లో ప్రవేశాలు
తెలంగాణ పాలిసెట్-2024 ద్వారా పీవీ.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో అడ్మిషన్లు(PolyCET Admissions) కల్పిస్తారు. వీటితో పాటు తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ విద్యాసంస్థలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు వెల్లడించారు.
ఫలితాల విడుదలు
తెలంగాణ పాలిసెట్ నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తారు. జూన్ మొదటి వారంలో పాలిసెట్ 2024 ఫలితాలు వెలువడతాయి. మరిన్ని వివరాలకు పాలిటెక్నిక్ www.polycet.sbtet.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి. పాలిసెట్ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి లేదా polycet-te@telangana.govi.inకు మెయిల్ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం