AP Model Schools: ఏపీ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాల్ టిక్కెట్లు విడుదల, ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష
AP Model Schools: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టిక్కెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో విద్యార్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Model Schools: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ఆరోతరగతి అడ్మిషన్ల Admissions కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు Hall Ticktes విడుదల చేశారు. 2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(Model Schools)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21 న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఆరోతరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
కేజీబీవీల్లో ఇంటర్ అడ్మిషన్లు…
ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీల్లో 11వ తరగతిలో Inter Admissions ప్రవేశానికి ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరణ గడువు పెంచారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచుతున్నట్లు సమగ్ర శిక్షా అధికారులు తెలిపారు.
2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ ఏప్రిల్ 11తో ముగియనుంది. మరింత మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకోడానికి వీలుగా ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి గడువు పెంచినట్టు తెలిపారు.
ఇప్పటివరకు 6వ తరగతికి 45,621 దరఖాస్తులు, 11వ తరగతికి 29,621 దరఖాస్తులు వచ్చాయని, 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ చేయడానికి 8383 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు వివరించారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/ వె బ్సైట్ ద్వారా స్వీకరిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందడంతో పాటు దరఖాస్తులో పేర్కొన్న పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. మరిన్ని వివరాలకు RTE Toll Free No 18004258599 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసే విద్యార్ధినుల కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్ష ఇరవై వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్షా నలభై వేలు మించకూడదని తెలిపారు.
టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు
ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు.
3,4,5 తరగతుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్, ప్రిన్స్ టన్, యూ.ఎస్.ఏ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,104 పాఠశాల్లలో ఈ పరీక్ష నిర్వహించారు. 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులకు గానూ 4,17,879 మంది (92 శాతం) హాజరయ్యారు. ఈ నెల 12న 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు జూనియర్ టోఫెల్ పరీక్ష నిర్వహిస్తారు.
సంబంధిత కథనం