AP ECET 2023 : ఫార్మసీ ప్రవేశాలకు తుది దశ నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే
AP ECET 2023 Latest News: ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
AP ECET 2023 Updates: ఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈసెట్ తుదిదశ షేడ్యూలును సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి శనివారం విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్ ను అనుసరించి సెప్టెంబరు 25, 26 తేదీలలో విద్యార్ధులు ఆన్ లైన్ లో రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపును కూడా పూర్తి చేయాలని వివరించారు.
సెప్టెంబరు 25 నుండి 27 వరకు ఆన్ లైన్ ద్వారా ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ ఉంటుంది, ఆఫ్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఎవరైనా విద్యార్ధులు ఆఫ్షన్లను మార్చుకోదలిస్తే సెప్టెంబర్ 27వ తేదీ మాత్రమే అవకాశం ఉంటుంది. 28వ తేదీ అయా కళాశాలల్లో రిజర్వేషన్లను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. 29,30 తేదీలలో విద్యార్ధులు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలి. ఇప్పటికే క్లాసులు ప్రారంభం అయినందున విధ్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫార్మసీ అడ్మిషన్లను పొందాలని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు.
ముఖ్య తేదీలు:
సెప్టెంబర్ 25, 26 - ఆన్ లైన్ రిజిస్ట్రేషన్
సెప్టెంబరు 25 నుండి 27 వరకు ఆన్ లైన్ ద్వారా ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్
సెప్టెంబర్ 28వ తేదీన సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 29, 30 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx లింక్ తో ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
గడువు పొడిగింపు…
Telangana Open School Society 2023: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) కీలక అలర్ట్ ఇచ్చింది. వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదువలేనివారి కోసం ఇప్పటికే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం(2023-24)లో 10వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనుంది. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగియటంతో... చదువాలనుకునే వారికి మరో అవకాశం కల్పించింది. ఈనెల 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు అభ్యర్థులు నిర్ణీత ఫీజులను చెల్లించాలని అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత మీ అప్లికేషన్ ను ఎంచుకున్న స్కూల్ లేదా కాలేజీలో ఇవ్వాలి.