AP Gurukula Admissions: ఏపీలో గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు, ఏప్రిల్ 5వరకు దరఖాస్తుల స్వీకరణ
AP Gurukula Admissions: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించారు.
AP Gurukula Admissions:: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించినట్టుఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరంలో 5,6,7, 8 తరగతులలో మిగిలిపోయిన సీట్లు(బ్యాక్ లాగ్ సీట్లు), ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన APRS CET-2024, APRJC&DC CET-2024 లకు దరఖాస్తు చేసేందుకు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడగించారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రియల్ 5 లోపు https://aprs.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ 2024, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఏపీఆర్డీసీ 2024, మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్ క్యాట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలు, అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను నోటిఫికేషన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్ డా బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల్లో APSWREIS ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరయ్యారు.
రాష్ట్రంలోని వివిధ క్యాంపస్‌లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 22న March22 ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక ఉంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ కార్యదర్శి వెల్లడించారు.
డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి డా.మహేష్ కుమార్ రావిరాల ప్రకటించారు.
5వ తరగతిలో ప్రవేశాలకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా 10 మార్చి 2024న నిర్వహించిన పరీక్షకు 42,928 మంది విద్యార్ధులు హాజరైనట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి వివరించారు.
ప్రవేశపరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీలలో విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను http.//apbragcet.apcfss.in నుంచి తెలుసుకోవచ్చన్నారు.
పరీక్షలకు హాజరైన విద్యార్ధుల మెరిట్ లిస్ట్ ఆధారంగా 22 మార్చి 2024 న మొదటి దశ విద్యార్ధుల ఎంపిక ఆన్ లైన్ విధానంలో జరుగుతుందని, మిగిలిన ఖాళీలను ఆధారంగా జోన్ ల వారీగా తర్వాత దశలో ఎంపికలు ఉంటాయని చెప్పారు.