తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Govt Green Signal For 1569 Jobs In Basti Dawakhanas

TS Govt Jobs: బస్తీ, పల్లె దవాఖానల్లో1,569 ఉద్యోగాలు

HT Telugu Desk HT Telugu

08 September 2022, 10:06 IST

    • jobs in pallea basti dawakhanas: పేదలకు మరిన్ని వైద్య సదుపాయాలను అందించటమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది, పల్లె, బస్తీ దవాఖానాల కోసం కొత్తగా 1,569 వైద్య పోస్టులు మంజూరు చేసింది.
1569 వైద్య పోస్టుల మంజూరు
1569 వైద్య పోస్టుల మంజూరు

1569 వైద్య పోస్టుల మంజూరు

1569 jobs in pallea basti dawakhanas:ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చాలా శాఖాల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ భారీ సంఖ్యలో అనుమతులు ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పల్లె, బస్తీ దవాఖానాలకు కూడా 1569 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీటిని ఒప్పంద ప్రతిపాదకన భర్తీ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Medak News : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెన్త్ విద్యార్థికి 6.7 జీపీఏ-తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

TS Tribal Welfare Schools : టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు, 38 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత

TS EAPCET 2024 Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Parenting Tips : వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి-ఆ బాధ్యత తల్లిదండ్రులదే!

మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పేరిట ఈ పోస్టులు నింపనున్నారు. ఇందులో బస్తీ దవాఖానాల్లో 349, పల్లె దవాఖానాల్లో 1,220 కలిపి 1569 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు ఇలా ఉంటాయి...

ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ అర్హత కలిగిన వైద్యులను తీసుకుంటారు. ఎంబీబీఎస్‌ అర్హత కలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అయితే వీరు ఆసక్తి కనబర్చకుంటే,... 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులను తీసుకుంటారు.

2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.

వేతనం ఎంతంటే...

పల్లె బస్తీ దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ వైద్యులకు నెలకు రూ.40 వేల వేతనం ఇస్తారు.

ఈ పోస్టులోనే పనిచేసే స్టాఫ్‌నర్సులకు నెలకు రూ.29,900 చొప్పున గౌరవ వేతనం ఉంటుంది.

అర్హత వయసు- 18-44 ఏళ్లు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది)

జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆయా జిల్లాల్లో సెప్టెంబర్ 7వ తేదీన నియామక ప్రకటన వెలువడింది.

దరఖాస్తు దాఖలుకు ఈ నెల 17 తుది గడువుగా ప్రకటించారు.

అర్హుల జాబితా - సెప్టెంబర్ 29, 2022

అభ్యంతరాల స్వీకరణ - సెప్టెంబర్ 30, 2022

తుది జాబితా - అక్టోబర్ 3, 2022

TSPSC Job Recruitment 2022 : తాజాగా మున్సిపల్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు సమర్పించాలి.