NIH Recruitment 2022: NIHలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం!-national institute of hydrology recruitment apply for 18 posts of scientists ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  National Institute Of Hydrology Recruitment: Apply For 18 Posts Of Scientists

NIH Recruitment 2022: NIHలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం!

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 04:11 PM IST

NIH Roorkee Scientist Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, ఉత్తరాఖండ్ 18 సైంటిస్ట్ పోస్టుల (Scientist Posts) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీ లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

NIH Roorkee Scientist Recruitment 2022
NIH Roorkee Scientist Recruitment 2022

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో 18 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తును 20 అక్టోబర్ 2022 లోపు నిర్ణీత ఫార్మాట్‌లో సమర్పించవచ్చు. నేషనల్ హైడ్రాలజీ ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సైంటిస్ట్ ఎఫ్, సి, బి కేటగిరీలలో పోస్టులకు భర్తీ చేయనుంది. పోస్టుల బట్టి అర్హత, వయోపరిమితి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించిన నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని అధికారులు సూచించారు.

దరఖాస్తుకు సంబంధించిన ముఖ్య తేదీలు

ప్రారంభ తేదీ - 3 సెప్టెంబర్ 2022

దరఖాస్తు చివరి తేదీ - 20 అక్టోబర్ 2022

ఖాళీల వివరాలు :

సైంటిస్ట్ ఎఫ్ - 1 పోస్ట్

సైంటిస్ట్ సి - 6 పోస్టులు

సైంటిస్ట్ బి - 11 పోస్టులు

వయో పరిమితి - సైంటిస్ట్ ఎఫ్ అభ్యర్థి గరిష్ట వయస్సు 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. సైంటిస్ట్ సి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు.అదేవిధంగా, సైంటిస్ట్ బి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము - అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్‌ను సమర్పించాలి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి:

దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ http://nihroorkee.gov.in/ని సందర్శించవచ్చు.

పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని కూడా క్రింది చిరునామాకు పంపాలి-

సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ,

జల్ విజ్ఞాన్ భవన్, రూర్కీ, జిల్లా- హరిద్వార్ (ఉత్తరాఖండ్) - 247667

వేతనం: ఈ ఉద్యోగానికి అర్హత సాధించినవారు నెలకు రూ.56,000 నుంచి రూ.2,16,600 వ‌ర‌కు జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్