Cobra: కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. మ్యాథ్స్ సైంటిస్ట్‌గా విక్రమ్.. ఓ లుక్కేయండి-kollywood hero vikram new movie cobra trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Cobra: కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. మ్యాథ్స్ సైంటిస్ట్‌గా విక్రమ్.. ఓ లుక్కేయండి

Cobra: కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. మ్యాథ్స్ సైంటిస్ట్‌గా విక్రమ్.. ఓ లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
Aug 25, 2022 06:41 PM IST

విక్రమ్ నటించిన తాజా చిత్రం కోబ్రా. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

విక్రమ్ కోబ్రా ట్రైలర్ విడుదల
విక్రమ్ కోబ్రా ట్రైలర్ విడుదల (Twitter)

కోలీవుడ్ హీరో విక్రమ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతూ ఉంటాయి. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువగా ఉండే విక్రమ్.. సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే కోబ్రా. ఈ సినిమా టీజర్, ఫస్టులుక్, గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదలచేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌ను గమనిస్తే విక్రమ్‌ను విలన్ గ్యాంగ్ చిత్రహింసలు పెట్టే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇందులో విక్రమ్ విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు ఒక్కక్కటి రివీల్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ప్రతి లుక్‌ను తనదైన మార్కును చూపించారు విక్రమ్. ఇందులో ఆయన గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. మరి ఈ చిత్రంలో ఆయన వివిధ గెటప్పులు ఎందుకు వేస్తారు? ఈ సినిమాకు గణిత శాస్త్రానికి సంబంధం ఏంటి? కోబ్రా రహస్యమేంటో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ చేసింది. మృణాళిని రవి, కేఎస్ రవికూమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. 7 స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఇదే విధంగా ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్