Rashmika Mandanna: చియాన్ విక్రమ్‌తో రొమాన్స్ చేయనున్న రష్మికా మందన్నా
Rashmika Mandanna: తమిళ సూపర్‌స్టార్ చియాన్ విక్రమ్‌తో రష్మికా మందన్నా రొమాన్స్ చేయనుంది. చియాన్ 61 మూవీలో అతని సరసన నటించే ఛాన్స్ రష్మికా కొట్టేసినట్లు సమాచారం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటు సౌత్, అటు బాలీవుడ్‌లోనూ ఆమె నటిస్తోంది. ఇక ఇప్పుడు ఆమె చియాన్ విక్రమ్ సరసన నటించే పెద్ద ఛాన్స్ కొట్టేసింది. ఈ మధ్యే పా రంజిత్‌తో విక్రమ్ తన నెక్ట్స్ మూవీ చియాన్ 61లో నటించనున్నాడన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు
ఈ నెల 16న ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఈ మూవీలో విక్రమ్ సరసన రష్మికా నటించనున్నట్లు సమాచారం. ఈసారి విక్రమ్ సరసన ఓ కొత్త ఫేస్ ఉండాలని భావించిన మేకర్స్.. దీనికోసం రష్మిక పేరును పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో నటించడానికి రష్మికా కూడా ఓకే చెప్పిందట. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
మరోవైపు చియాన్ 61 షెడ్యూల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. 19వ శతాబ్దానికి చెందిన కథ ఇది. ఓ హై యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. కేజీఎఫ్ ఫీల్డ్స్‌లో పని చేసిన కార్మికుల జీవితాలకు అద్దం పట్టేలా ఈ మూవీని తీయనున్నారు. ఇందులో ఆర్య కూడా నటించనున్నాడు. సినిమాకు జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించనున్నాడు. చియాన్ 61ను 3డీలోనూ చిత్రీకరిస్తుండటం విశేషం.
మరోవైపు రష్మికా మందన్నా ప్రస్తుతం దళపతి విజయ్‌తో వారసుడులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా దుల్కర్ సల్మాన్‌తో సీతా రామంలోనూ నటిస్తోంది. బాలీవుడ్‌లో రణ్‌బీర్‌తో యానిమల్‌లో, సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నూలో, అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బైలోనూ నటిస్తోంది.