తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Finance Minister Harish Rao Will Introduce State Budget In Assembly Today

TS Budget : నేడు అసెంబ్లీ ముందుకు బడ్జెట్…

HT Telugu Desk HT Telugu

06 February 2023, 9:31 IST

    • TS Budget తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.  2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.
తెలంగాణ మంత్రి హరీష్‌ రావు  (ఫైల్)
తెలంగాణ మంత్రి హరీష్‌ రావు (ఫైల్)

తెలంగాణ మంత్రి హరీష్‌ రావు (ఫైల్)

TS Budget 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశ పెడతారు. గత ఏడాది మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో అంచనాలు ఎక్కువే ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ 20 రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి గత కేటాయింపులు, చేసిన వ్యయం తదితర అంశాలపై సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టేబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.

ఎన్నికల ఏడాది కావడంతో కీలక ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు పలు వర్గాలను ఆకర్షించేలా సంక్షేమ పథకాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్‌ సమావేశమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది.

ప్రత్యేక పూజలు నిర్వహించిన హరీష్ రావు…

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ కి బయల్దేరారు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గువ్వల బాల రాజ్, టీఎస్ఎంఐ డిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా ఉంటుందని, కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ తయారైందని హరీష్ రావు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెద్దుల్లా బడ్జెట్‌లో సమపాళ్లలో ఉండబోతోందని చెప్పారు. కేంద్రంలో తెలంగాణపై వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశం అవలంబిస్తోందని, దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందని చెప్పారు. బడ్జెట్‌కు కేబినేట్ ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందని చెప్పారు. ఉదయం 10.30 కు బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పారు.