తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trains Cancelled : గోదావరి ప్రమాదంతో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

Trains Cancelled : గోదావరి ప్రమాదంతో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

HT Telugu Desk HT Telugu

15 February 2023, 12:43 IST

    • Trains Cancelled : బీబీనగర్‌-ఘట్‌కేసర్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. బుధవారం ఉదయం 6.10గంటలకు ట్రైన్ నంబర్ 12727 నంబర్ గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్లను రద్దు చేశారు. 
గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు
గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు (ht)

గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు

Trains Cancelled విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో బుధవారం పలు రైళ్లను రద్దు చేశారు. సింగల్ లైన్‌ మాత్రమే అందుబాటులో ఉండటంతో రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు వీలు కాకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

ట్రైన్ నంబర్ 07791 కాచిగూడ - నడికూడి ప్యాసింజర్‌, ట్రైన్‌ నంబర్ 07792 నడికూడి- కాచిగూడ, ట్రైన్‌ నంబర్ 07462 సికింద్రాబాద్‌ - వరంగల్ రైలు, ట్రైన్‌ నంబర్ 07463 వరంగల్ - హైదరాబాద్ రైలు, ట్రైన్‌ నంబర్ 12706 సికింద్రాబాద్‌ - గుంటూరు రైలు, ట్రైన్‌ నంబర్ 12705 గుంటూరు - సికింద్రాబాద్ రైలు, ట్రైన్‌ నంబర్ 17645 సికింద్రాబాద్‌ - రేపల్లె రైలును బుధవారం రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

పాక్షికంగా రద్దైన రైళ్లు....

ట్రైన్‌ నంబర్ 17234 సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రబాద్‌ రైలును కాజీపేట- సికింద్రాబాద్ మధ్య రద్దు చేశారు. ట్రైన్‌ నంబర్ 17202 సికింద్రాబాద్ - గుంటూరు రైలును సికింద్రాబాద్ - కాజీపేట మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 12713 విజయవాడ - సికింద్రాబాద్ రైలును వరంగల్-సికింద్రాబాద్ మధ్య రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 12714 సికింద్రాబాద్‌ - విజయవాడ రైలును సికింద్రాబాద్‌ - వరంగల్ మధ్య రద్దు చేశారు.ట్రైన్ నంబర్ 17660 భద్రాచలం రోడ్ - సికింద్రాబాద్ రైలును కాజీపేట - సికింద్రాబాద్ మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 12747 గుంటూరు - వికారాబాద్‌ రైలును నల్గొండ - వికారా బాద్ మధ్య రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 12748 వికారాబాద్ - గుంటూరు రైలును వికరాబాద్‌-నల్గొండ మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07757 వరంగల్ - సికింద్రాబాద్ రైలును ఆలేరు- సికింద్రాబాద్ మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07974 మిర్యాలగూడ - కాచిగూడ రైలును రామన్న పేట- కాచిగూడ మధ్య రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 07276 కాచిగూడ-మిర్యాలగూడ రైలును కాచిగూడ-రామన్నపేట మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17201 గుంటూరు సికింద్రాబాద్ రైలును కాజీపేట-సికింద్రాబాద్ మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17233 సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్ నగర్ రైలును సికింద్రాబాద్ - కాజీపేట మధ్య రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 12806 లింగంపల్లి-విశాఖపట్నం రైలును సికింద్రాబాద్-విజయవాడ మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 12805 విశాఖపట్నం - లింగంపల్లి రైలును విజయవాడ - లింగంపల్లి మధ్య రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 22705 తిరుపతి-జమ్మూతావి రైలును సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా మళ్లించారు.

టాపిక్