LIVE UPDATES
Zaheerabad : రైతుల కోసం ప్రాణాలైనా అడ్డేస్తాం... ఫార్మా సిటీకి భూములు దక్కకుండా పోరాడుతాం - హరీశ్ రావు (basara temple)
Telangana News Live October 3, 2024: Zaheerabad : రైతుల కోసం ప్రాణాలైనా అడ్డేస్తాం... ఫార్మా సిటీకి భూములు దక్కకుండా పోరాడుతాం - హరీశ్ రావు
03 October 2024, 22:17 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: Zaheerabad : రైతుల కోసం ప్రాణాలైనా అడ్డేస్తాం... ఫార్మా సిటీకి భూములు దక్కకుండా పోరాడుతాం - హరీశ్ రావు
- ప్రాణాలైనా అడ్డేస్తాం కానీ ఫార్మా సిటీకి భూములివ్వమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జహీరాబాద్ లోని న్యాల్కల్ లో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. రైతుల భూములను కాపాడేందుకు న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు.
Telangana News Live: TG DSC Results 2024 : ఈ నెల 5లోపు డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి - 9న నియామక పత్రాలు అందజేత..!
- డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. అక్టోబర్ 5వ తేదీలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దసరాలోపు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Telangana News Live: TG Paddy Procurement : సన్నాలకు రూ.500 బోనస్ - 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - సీఎం రేవంత్ ఆదేశాలు
- ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని స్పష్టం చేశారు. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Telangana News Live: Inter Colleges Dasara Holidays : కాలేజీలకు 8 రోజులు దసరా సెలవులు - తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన
- తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులపై ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 13వ తేదీ వరకు హాలీ డేస్ ఉంటాయని పేర్కొంది. 14వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది.
Telangana News Live: Nagarjuna Akkineni : కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున
- Nagarjuna Akkineni : సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ చేసిన కామెంట్స్.. ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు హీరో అక్కినేని నాగార్జున. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
Telangana News Live: Konda surekha vs KTR : కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో : కొండా సురేఖ
- Konda surekha vs KTR : మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో.. కేసీఆర్ కనపడటం లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడేమో అని సంచలన ఆరోపణలు చేశారు.
Telangana News Live: TG Family Digital Cards : ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పత్రాలు విడుదల - ఈ ఒక్క కార్డుతోనే 30 రకాల ప్రభుత్వ సేవలు!
- ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను వివరిస్తూ పలు అంశాలను చెప్పారు.
Telangana News Live: Gandhi Medical College : సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..!
- Secunderabad Gandhi Medical College : సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 12 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 05వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి అవుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Telangana News Live: KA Paul On Konda Surekha : కొండా సురేఖ రాజీనామా చేయకపోతే కేసు వేస్తా : కేఏ పాల్
- KA Paul On Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు రాంగోపాల్ వర్మ కూడా కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అక్కనేని కుటుంబానికి దన్నుగా నిలుస్తున్నారు.
Telangana News Live: Bail For Johnny Master : జానీ మాస్టర్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
- Bail For Johnny Master : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు కాస్త ఊరట లభించింది. జానీకి ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. జానీ మాస్టర్ తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం మంజూరు చేసింది.
Telangana News Live: Smita Sabharwal on Konda surekha : కొండా సురేఖ మాటలు విని షాక్ అయ్యా.. మంత్రి వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారి విచారం
- Smita Sabharwal on Konda surekha : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై రాజకీయ, సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో హుందాతనం ఉండాలన్నారు.
Telangana News Live: Fake Notes: పోలీసులకు చిక్కిన నకిలీ నోట్ల ముఠా... ఐదుగురు అరెస్ట్, రూ.1.61 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం
- Fake Notes: జగిత్యాల జిల్లాలో చిరు వ్యాపారులకు నకిలీ నోట్లను అంటగట్టి మోసం చేసే ముఠా గుట్టు రట్టయింది. ఐదుగురిని కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.61 లక్షల విలువ గల నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
Telangana News Live: TG Local Body Elections : మద్యం మానేసిన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో టికెట్లు : కాంగ్రెస్ ఎమ్మెల్యే
- TG Local Body Elections : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్యపానం, ఇతర మాదకద్రవ్యాలు తీసుకోబోమని.. పార్టీ కార్యకర్తలు, యువతతో ప్రమాణం చేయించారు. మద్యం మానేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పారు.
Telangana News Live: Jagityala Bus Journey: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ...జగిత్యాల పల్లెవెలుగు బస్సులో 150 మంది ప్రయాణం
- Jagityala Bus Journey: బతుకమ్మ , దసరా పండుగల సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. ప్రయాణికులతో బస్సులన్ని కిటకిటలాడుతున్నాయి. గ్రామాలకు వెళ్లే బస్సులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి.జగిత్యాల జిల్లాలో పల్లె వెలుగు బస్సులో 150 మంది ప్రయాణించడం బస్సుల కొరతకు, రద్దీకి అద్దం పడుతుంది.
Telangana News Live: Siddipet Crime: నిర్లక్ష్యంగా తాగి పడేసిన సిగరెట్టు పీక, తెలంగాణ తల్లి విగ్రహానికి మంటలు, నిందితుడి అరెస్ట్
- Siddipet Crime: మద్యం మత్తులో సిగరెట్టు తాగి నిర్లక్ష్యంగా ఆ సిగరెట్టు పీక అక్కడ పడేసి వెళ్ళి పోయాడు. ఈ ఆకతాయి పని వల్ల అక్కడే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంపై కప్పిన ముసుగు కాలి.. విగ్రహం కొంతభాగం కాలిపోయింది. సిగరెట్టూ పీకే కదా అని నిర్లక్ష్యంగా అక్కడ పడేసి పోవడం వలన ఆ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.
Telangana News Live: Konda Surekha: వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. మీ మనో భావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదన్న కొండా సురేఖ
- Konda Surekha: కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు.
Telangana News Live: Basara Dasara: బాసరలో వైభవంగా 'దేవీ' శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు... అక్షర పూజలకు ప్రత్యేక సదుపాయాలు
- Basara Dasara: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా గోదావరి నది తీరాన కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రుల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు కళ్లరా వీక్షించడానికి దేశ నలుమూల నుంచి వేలాది భక్తులు హాజరు కానున్నారు.