తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Komatireddy Security: కోమటిరెడ్డి భద్రత సంగతి పది రోజుల్లో తేల్చాలన్న హైకోర్టు

Komatireddy Security: కోమటిరెడ్డి భద్రత సంగతి పది రోజుల్లో తేల్చాలన్న హైకోర్టు

HT Telugu Desk HT Telugu

05 April 2023, 9:09 IST

    • Komatireddy Security:  మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని చేసిన దరఖాస్తుపై పదిరోజుల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తనకు భద్రత కల్పించడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కోమటిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 
తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (tshc)

తెలంగాణ హైకోర్టు

Komatireddy Security: రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో తనకు భద్రత పెంచాలంటూ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెట్టుకున్న వినతిపత్రంపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

తనకు ప్రభుత్వం కల్పించిన భద్రతను కుదించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. రాజగోపాల్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు ప్రాణహాని ఉందని, మునుగోడు ఉప ఎన్నిక తరువాత దాడి కూడా జరిగిందని పేర్కొన్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు 2+2 భద్రత ఉంటుందని, మాజీ ఎమ్మెల్యే అయినందువల్ల 1+1 భద్రత కల్పించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది రూపేందర్‌ తెలిపారు. ఈ విషయాన్ని పిటిషనర్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి, పిటిషనర్‌ సమర్పించిన వినతిపత్రంపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు చెరుకు సుధాకర్‌, ఆయన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. చెరుకు సుధాకర్‌ కుమారుడినిహెచ్చరిస్తూ గతంలో వెంకటరెడ్డి మాట్లాడటంపై కలకలం రేగింది.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని చెరుకుసుధాకర్ న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి పోలీసులు కేసు నమోదు చేయని పక్షంలో కింది కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.