తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Ssc Exams Hall Tickets Released 10th Hall Ticket Download 2023

TS SSC Hall Tickets : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి హాల్ టికెట్స్

HT Telugu Desk HT Telugu

24 March 2023, 9:28 IST

  • Telanagana SSC hall tickets 2023: పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. నేటి నుంచే అంటే.. మార్చి 24వ తేదీన వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు
24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

Telanagana SSC Exams 2023 : ఏప్రిల్ మూడో తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షల జరగనున్నాయి. నేటి నుంచి(24-03-2023) అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది జరగబోయే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణ కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటలకు వరకు జరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

ఈ ఏడాది పరీక్షలు వంద శాతం సిలబస్ తో జరగనున్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహించారు. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది.

ఏప్రిల్ 3 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్

ఏప్రిల్ 4 - సెకండ్ లాంగ్వేజ్

ఏప్రిల్ 6 - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

ఏప్రిల్ 8 - గణితం

ఏప్రిల్ 10 - సైన్స్

ఏప్రిల్ 11 - సోషల్

ఈ సంవత్సరం.. పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్నారు. ఇందులో జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. అందులో ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్. జనరల్ సైన్స్ మెుదట ఓ పేపర్ ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని అధికారులు చెప్పారు. ఆ తర్వాత 20 నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్‌ ఇవ్వాలని వెల్లడించారు. రెండో పేపర్‌ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇవ్వనున్నారు.