తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ssc Hall Tickets : విద్యార్థులకు అలర్ట్... 24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

TS SSC Hall Tickets : విద్యార్థులకు అలర్ట్... 24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

HT Telugu Desk HT Telugu

19 March 2023, 5:05 IST

    • Telanagana SSC hall tickets 2023: పదో తరగతి విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. మార్చి 24వ తేదీన వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు
24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

24 నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు

Telanagana SSC Exams 2023: తెలంగాణ పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. శనివారం అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించి.. పలు అంశాలపై చర్చించారు. అయితే ఈనెల 24 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఈ ఏడాది జరగబోయే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

పరీక్షల నిర్వహణ పకడ్బదీంగా ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటలకు వరకు జరుగుతాయని చెప్పారు. త్వరలో డీఈఓలు,ఆయా జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు వివరించారు.

మార్చి 3 నుంచి పరీక్షలు..

ఇక ఈ ఏడాది పరీక్షలు వంద శాతం సిలబస్ తో జరగనున్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను మార్చి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించారు. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది.

ఏప్రిల్ 3 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్

ఏప్రిల్ 4 - సెకండ్ లాంగ్వేజ్

ఏప్రిల్ 6 - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

ఏప్రిల్ 8 - గణితం

ఏప్రిల్ 10 - సైన్స్

ఏప్రిల్ 11 - సోషల్ స్టడీస్

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగిశాయి.

ఇక ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. విద్యార్ధుల హాల్‌ టిక్కెట్లను https://www.bse.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 8న ఆంగ్లం, ఏప్రిల్‌ 10న గణితం, ఏప్రిల్‌ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్‌ 15న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్‌ 17న కాంపోజిట్‌ కోర్సు, ఏప్రిల్‌ 18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష జరగనుంది. ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి కూడా హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.