తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Instructions To Prevent Theft In The Homes Over Dasara Holidays

TS Police Alert: దసరాకు ఊరెళ్తున్నారా? సోషల్ మీడియాలో పోస్టు చేయకండి…

HT Telugu Desk HT Telugu

02 October 2022, 8:05 IST

    • నగర ప్రజలకు పోలీసులు కీలక అలర్ట్ ఇచ్చారు. పండగకు ఊరెళ్తున్న వేళ... తీసుకోవాల్సిన జాగ్రతలపై పలు సూచలు చేశారు. శివార్లలోలో ఉండే వాసులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు రాచకొండ పోలీసులు 16 సూచనలు చేశారు. 
తెలంగాణ పోలీసుల అలర్ట్
తెలంగాణ పోలీసుల అలర్ట్ (twitter)

తెలంగాణ పోలీసుల అలర్ట్

police instructions to prevent theft in the homes: దసరా సెలవుల నేపథ్యంలో నగరంలో ఖాళీ అవుతోంది. పల్లెవైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తున్నారు. వరుస సెలవుల దినాలతో పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో అందరూ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని బస్టాండ్లు రద్దీగా మారిపోయాయి. అన్ని ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు ప్రజలు వెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.... ఇంటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నగర పోలీసులు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే ఇళ్లు గుళ్ల అవ్వటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. క్షేమంగా ఊరెళ్లి లాభంగా తిరిగి రావాలంటే ఏం చేయాలనే దానిపై పలు సూచనలు చేస్తూ ఓ సర్కులర్ కూడా ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

TS 10th Results 2024: నేడే తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

సూచనలివే….

ఊరికి వెళ్తున్నామనే హడావుడిలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. పండక్కి వెళ్లి తిరిగొచ్చేసరికి మీ ఇళ్లు గుళ్ల కాక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగల వేళ దొంగలు రెచ్చిపోయి తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు 16 సూచనలతో కూడిన ఓ పోస్ట్‌ని పలు మాధ్యమాల్లో అందుబాటులో ఉంచింది.

-ఊరు వెళ్లే వారు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగలు నగదును ఇంట్లో పెట్టకండి. బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలి. ఇది చాలా ఉత్తమం.

- బీరువా తాళం చెవులు బీరువా పైన కాని బీరువాలోని బట్టల కింద, ఇంట్లో పెట్టకూడదు.

-వాహనాలను ఇంటి దగ్గరే ఉంచి వాటి తాళాలను వెంట తీసుకెళ్తడం మంచిది.

-ఇంటి ముందు తలుపులకు సెంటర్‌ లాక్ వేసి బయట గొళ్లెం పెట్టకండి.

- ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు. తాళం కనిపించకుండా కర్టైన్స్ వేయాలి.

-ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచితే మంచిది.

- బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.

-బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో మరియు బయట లైట్‌ వేసి ఉంచండి.

-పేపర్‌ బాయ్, పాలవాళ్లను రావద్దని చెప్పండి.

-నమ్మకైన వాచ్‌మెన్‌లను మాత్రమే నియమించుకోండి.

- మీరు ఊరికి వెళ్లేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి.

- ఊరికి వెళ్లిన తర్వాత కూడా ఇంటి పక్కన వాళ్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.

- బయటకు వెళ్లేటప్పుడు , వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు, జాగ్రత్త, వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది.

-మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది. భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

- మీ ఇంటికి సీసీ కెమెకాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని డీవీఆర్‌ని రహస్య ప్రదేశాలలో భద్రపరుచుకోవాలి. మొబైల్ యాప్‌ ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.

- మీరు బస్సు లేదా రైలు ప్రయాణ సమయంలో అపరిచత వ్యక్తులు ఇచ్చిన తిను బండారాలు తీసుకోవద్దు. విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే అటువంటి బ్యాగును మీ దగ్గరే భద్రంగా పెట్టుకోవాలని మర్చిపోవద్దు.

- మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయకండి.

ఎవరిమీదనైనా అనుమానం వస్తే 100 నెంబర్ కు గాని, రాచకొండ కంట్రోల్ రూమ్ 9494721100 కు డయల్ చేయాలని సూచించారు.

<p>రాచకొండ పోలీసుల ప్రకటన</p>

టాపిక్