తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : ఫలితాలు జాప్యం కావడంపై బీజేపీ అనుమానాలు…

Bandi sanjay : ఫలితాలు జాప్యం కావడంపై బీజేపీ అనుమానాలు…

HT Telugu Desk HT Telugu

06 November 2022, 11:47 IST

    • Bandi sanjay మునుగోడు ఎన్నికల ఫలితాలు జాప్యం అవుతుండటంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం  ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వెంటనే వెల్లడైనా, ఆ తర్వాత రౌండ్లలో ఫలితాలను వెల్లడించడంలో జాప్యం జరగడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 
మునుగోడులో ఓట్ల లెక్కింపు తీరుపై బీజేపీ అనుమానాలు
మునుగోడులో ఓట్ల లెక్కింపు తీరుపై బీజేపీ అనుమానాలు

మునుగోడులో ఓట్ల లెక్కింపు తీరుపై బీజేపీ అనుమానాలు

Bandi sanjay మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు విడుదల కాకపోవడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఫలితాలను వెల్లడించడంలో అధికారులు వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరిపై సందేహం వ్యక్తం చేవారు. టీఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను సీఈవో అప్డేట్ చేయడం లేదని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

బీజేపీ లీడ్ వచ్చినా ఫలితాలను వెల్లడించడంలో సీఈవో తాత్సరం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేయడంలో జరిగిన జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ ప్రశ్నించారు.

మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని బీజేపీ నేతలు నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తోంది.

సీఈఓకు కేంద్ర మంత్రి ఫోన్….

మరోవైపు మునుగోడు ఎన్నికల ఫలితాలు జాప్యం జరగడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేసినట్లు సీఈవో ప్రకటించారు.

అధికారికంగా వెల్లడించే వరకు ప్రకటించొద్దు….

మరోవైపు మునుగోడు ఉపఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించే వరకు ఓపిక పట్టాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. మీడియా సంస్థలు, కొన్ని మాధ్యమాలలో తప్పు దారి పట్టించేలా వార్తలు వెలువడుతున్నాయని, ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించే ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.