తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : అలర్ట్.. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే

SCR Special Trains : అలర్ట్.. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

15 March 2023, 14:47 IST

    • South Central Railway Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.
ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్ని సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఆయా వివరాలు చూస్తే…..

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Special Trains between Secunderabad - Tirupati: తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి(నెంబర్ 07849) వెళ్లై స్పెషల్ ట్రైన్...మార్చి 17, 24, 31వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. కేవలం శుక్రవారం తేదీల్లో మాత్రమే ఈ సర్వీసులు నడుస్తాయని అధికారులు ప్రకటించారు. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 07490) మార్గంలో మార్చి 19, 26 తేదీల్లో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు పేర్కొన్నారు.

ఇక సికింద్రాబాద్ - ధనపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. మార్చి 19, 26వ తేదీల్లో ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు రాత్రి 07 గంటలకు ధనపూర్ కు చేరుకుంటుంది. ఇక ధనపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య... మార్చి 16, 23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి ధనపూర్ నుంచి రాత్రి 08.50 గంటలకు బయల్దేరి...రెండోరోజు ఉదయం 04.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ప్రత్యేక రైళ్లు.... కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంప్లి, సిర్పూర్, బలార్షా, నాగ్ పూర్, జబల్ పూర్, కత్నీ, సత్నా, మణిక్ పూర్, ప్రయాగరాజ్, బక్సర్, అరా స్టేషన్లల్లో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ అండ్ జనరల్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక నంద్యాల - కడప మధ్య నడిచే డెమో రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మార్చి 14, 15, 16వ తేదీల్లో ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.