తెలుగు న్యూస్  /  Telangana  /  Senior Congress Leader Marri Sashidhar Reddy Slams Revanth Reddy

కాంగ్రెస్ లో కల్లోలానికి వారిద్దరే కారణం- మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

17 August 2022, 14:05 IST

    • రేవంత్ రెడ్డిపై మరో సీనియర్ నేత ఫైర్ అయ్యారు. పార్టీని నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌.. రేవంత్‌ ఏజెంట్‌గా మారిపోయాడని ఆరోపించారు.
రేవంత్ పై సీనియర్ లీడర్ శశిధర్ రెడ్డి ఫైర్
రేవంత్ పై సీనియర్ లీడర్ శశిధర్ రెడ్డి ఫైర్

రేవంత్ పై సీనియర్ లీడర్ శశిధర్ రెడ్డి ఫైర్

marri sashidhar reddy slams revanth reddy: తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఆగటం లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతా... పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. అద్దంకి వ్యాఖ్యలు తీవ్ర దుమారానే రేపాయి. ఈ క్రమంలో స్వయంగా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. ఇదిలా ఉంటే మరో సీనియర్ నేత రేవంత్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

బుధవారం మీడియాతో మాట్లాడిన మర్రి శశిధర్ రెడ్డి... రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పార్టీని నడిపిస్తున్న వ్యక్తే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమవుతున్నారంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌.. రేవంత్‌ ఏజెంట్‌గా మారిపోయాడని ఆరోపించారు.కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌ రెడ్డి తీరు సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను గోడకేసి కొడతా అని అన్నప్పటికీ ఠాగూల్ ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న.. మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీసే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి హోంగార్డు కామెంట్స్, చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన స్టైలిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే... అద్దంకి దయాకర్ పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మునుగోడు వైపు చూసేది లేదంటూ స్పష్టం చేస్తూ వస్తున్నారు.

ఇక మాణిక్కం ఠాగూర్ వ్యవహారశైలిపైనా పార్టీలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. సీనియర్ల అభిప్రాయాలు, సలహాలను పట్టించుకోకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా వుంటున్నారని ఆయనపై కొందరు సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన... దాసోజు శ్రవణ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు.

గాంధీ భవన్ లో కీలక భేటీ...

మునుగోడు నియోజకవర్గ పరిస్థితులపై కాంగ్రెస్ నాయకత్వం సమీక్ష చేపట్టింది. ఇప్పటికే మండలాల వారీగా నియమించిన ఇంఛార్జ్ లతో మాణిక్యం ఠాగూర్ సమావేశమయ్యారు. ఇంఛార్జ్ ల పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కన్వీనగర్ గా ఉన్న మధుయాష్కీ సమావేశానికి రాకపోవటంపై సీరియస్ అయినట్లు సమాచారం.