తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Politics : మంతనాల వెనక మర్మమేంటి? కొత్త పార్టీ దిశగా ‘పొంగులేటి’ అడుగులు పడుతున్నాయా..?

TS Politics : మంతనాల వెనక మర్మమేంటి? కొత్త పార్టీ దిశగా ‘పొంగులేటి’ అడుగులు పడుతున్నాయా..?

HT Telugu Desk HT Telugu

06 May 2023, 10:35 IST

    • New Political Party in Telangana: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్. ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలే కాదు… చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే వీటికి భిన్నంగా పొంగులేటి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy Latest News: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... ఖమ్మం గుమ్మంలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కారు ఎక్కారు. నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆయనకు... 2019 ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవటంతో పాటు... ఎలాంటి పదవిని కూడా కట్టబెట్టలేదు. దీనికితోడు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన రోల్ పెద్దగా లేకుండా పోయింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితోనే కొనసాగుతూ వచ్చారు. ఇటీవల అధినాయకత్వం టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఆయనపై వేటు వేసింది బీఆర్ఎస్ అధినాయకత్వం. దీంతో కేసీఆర్ టార్గెట్ గా పొంగులేటి పావులు కదిపేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు... ఆయన్ను పార్టీలోకి రప్పించేందుకు తెగ చర్చలు జరుపుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే... ఏకంగా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో పొంగులేటి ఉన్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఇదీ కాస్త టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

కొత్త పార్టీ ప్రకటిస్తారా..?

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటికి ఆహ్వానం అందగా... ఏకంగా బీజేపీ నేతలు ఇంటికెళ్లే చర్చలు జరిపారు. పలు ప్రతిపాదనలు ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తామని ప్రకటించారు పొంగులేటి. మరికొంత మందితో చర్చలు జరిపేది ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జిల్లాలోని పలువురు ముఖ్య నేతలతో లోతుగా చర్చలు జరుపుతున్నారు పొంగులేటి. అయితే తాజాగా సొంతంగా పార్టీని ప్రకటిస్తారన్న చర్చ జోరందుకుంది. 'తెలంగాణ రైతు సమాఖ్య' పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జూపల్లి కూడా పొంగులేటితో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాకు చెందిన చకిలం అనిల్ కుమార్ కూడా పొంగులేటితో చర్చలు జరపనున్నారు. వీరేకాకుండా... పలు జిల్లాల్లోని ముఖ్య నేతలతో కూడా చర్చలు జరిపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు కొంత సమయం ఉన్న నేపథ్యంలో... వెనక ముందు ఆలోచించి... రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట..! సమీకరణాలు వర్కౌట్ కాకపోతే స్వతంత్రంగానే ముందుకెళ్లాలని చూస్తున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి..!

త్వరలోనే భారీ సభ...!

ఇక జిల్లాల వారీగా కసరత్తు పూర్తి చేసిన తర్వాత... భారీ బహిరంగ సభను తలపెట్టాలని పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 15న తన అనుచరులతో పొంగులేటి చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా పొంగులేటి వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పుట్టిస్తున్నాయి. అనుకున్నట్లే ఏదైనా జాతీయ పార్టీలోకి వెళ్తారా...? లేక సొంతంగా పార్టీని ప్రకటిస్తారా..? అనేది చూడాలి మరీ...!